Yuvraj Singh Biopic: యువరాజ్‌ బయోపిక్‌కు సర్వం సిద్ధం చేస్తోన్న కరణ్‌ జోహర్‌.. యూవీగా నటించబోయేది ఎవరో తెలుసా.?

Yuvraj Singh Biopic: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. సినీ తారల నుంచి రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఇలా అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖుల జీవిత కథ ఆధారంగా సినిమాలు..

Yuvraj Singh Biopic: యువరాజ్‌ బయోపిక్‌కు సర్వం సిద్ధం చేస్తోన్న కరణ్‌ జోహర్‌.. యూవీగా నటించబోయేది ఎవరో తెలుసా.?

Updated on: Oct 07, 2021 | 8:35 PM

Yuvraj Singh Biopic: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. సినీ తారల నుంచి రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఇలా అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖుల జీవిత కథ ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే క్రికెట్‌ రంగానికి సంబంధించి సచిన్‌, ధోని, కపిల్‌ దేవ్‌ల జీవిత కథ ఆధారంగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో క్రీడాకారుడి బయోపిక్‌కు సర్వం సిద్ధమవుతోంది. తన అద్భుత ఆటతీరుతో టీమిండియాను ఎన్నో విజయ తీరాలకు చేర్చిన యువరాజ్‌ సింగ్‌ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ విషయమై కరణ్ ఇప్పటికే యువరాజ్‌తో సంప్రదించాడని, అతని ప్రతిపాదనకు యూవీ కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి. యువరాజ్‌ సింగ్‌ తన పాత్రలో హృతిక్‌ రోషన్‌ లేదా రణ్‌బీర్‌ కపూర్‌లలో ఒకరు నటిస్తే బాగుంటుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే కరణ్‌ మాత్రం వీరిద్దరినీ కాదని సిద్ధార్థ్‌ చతుర్వేది అనే కొత్త కుర్రాడిని పరిచయం చేయాలని భావిస్తున్నాడని సమాచారం. సిద్ధార్థ్‌.. యువీతో దగ్గరి పోలికలు కలిగి ఉంటాడని, అందుకే యువీని ఒప్పించి మరీ అతన్ని ఎంపిక చేశాడని టాక్‌. మరి ఈ సినిమాపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Cruise Drugs Case: ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ కస్టడీ నిరాకరించిన కోర్టు..14 రోజుల రిమాండ్!

Rakul Preet Singh: ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. బయోపిక్‌ వార్తలపై స్పందించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

Samantha Ruth Prabhu: గేమ్ షోలో పెద్దమొత్తంలో గెలుచుకున్న సమంత.. ఆ డబ్బును ఏం చేసిందో తెలుసా..