Priyanka Chopra: రూ.165 కోట్ల ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రియాంక, నిక్ దంపతులు.. కారణం అదే..

వీరు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నారు. వివాహం తర్వాత తమ అభిరుచులకు తగినట్లుగా దాదాపు 20 మిలియన్ డార్లతో ఈ భవనాన్ని కొనుగోలు చేశారు. తమ కుతూరు మాల్టీ మేరీ చోప్రా జోనాస్‏తో కలిసి ప్రియాంక, నిక్ దంపతులు ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్లు ఈ జంట తమ ఇంటి నుంచి బయటకు వచ్చారని సమాచారం. ఈ మేరకు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Priyanka Chopra: రూ.165 కోట్ల ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రియాంక, నిక్ దంపతులు.. కారణం అదే..
Priyanka Chopra Family

Updated on: Feb 01, 2024 | 5:50 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా..ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‏ను 2019లో వివాహం చేసుకున్న తర్వాత యూఎస్‏కు మకాం మార్చింది ప్రియాంక. వీరు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నారు. వివాహం తర్వాత తమ అభిరుచులకు తగినట్లుగా దాదాపు 20 మిలియన్ డార్లతో ఈ భవనాన్ని కొనుగోలు చేశారు. తమ కుతూరు మాల్టీ మేరీ చోప్రా జోనాస్‏తో కలిసి ప్రియాంక, నిక్ దంపతులు ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్లు ఈ జంట తమ ఇంటి నుంచి బయటకు వచ్చారని సమాచారం. ఈ మేరకు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ ఇంట్లో ప్రియాంక, నిక్ దంపతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారట.

పేజ్ సిక్స్ నివేదిక ప్రకారం నిక్ జోనాస్, ప్రియంక చోప్రా నివసిస్తున్న ఇళ్లు డ్యామేజ్ అయ్యిందట. అనేక చోట్ల నీళ్లు లీక్ అవుతుండడంతో ఇంట్లో అనేక ప్రదేశాలు డ్యామేజ్ అయ్యాయని సమాచారం. దీంతో నష్టపరిహారం ఇప్పించాలని ఆ భవనాన్ని అమ్మిన వ్యక్తిపై కోర్టులో కేసు వేశారట. అయితే ఇప్పుడు వీరిద్దరు తమ కూతురితోపాటు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసి తాత్కలికంగా మరో ఇంట్లో ఉంటున్నారట. ప్రస్తుతం ధరల ప్రకారం ప్రియాంక, నిక్ వదిలేసిన ఇంటి విలువ రూ. 165 కోట్లు. ఇక ఈ ఇంటిని మరమ్మత్తు చేయడానికి దాదాపు రూ. 2.5 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని సమాచారం.

2019లో ఆ ఇంటి ఖరీదు రూ. 144 కోట్లు. విలాసవంతమైన ఆ ఇంటిలో ఏడు బెడ్‌రూమ్‌లు, తొమ్మిది బాత్‌రూమ్‌లు, టెంపరేచర్ కంట్రోల్డ్ వైన్ సెల్లార్, చెఫ్ కిచెన్, హోమ్ థియేటర్, బౌలింగ్ అల్లే, స్టీమ్ షవర్‌తోపాటు స్పా కూడా ఉన్నాయి. అలాగే సౌకర్యవంతమైన జిమ్, బిలియర్డ్స్ గది ఉన్నాయి. పిల్లలతో కలిసి అమూల్యమైన క్షణాలను గడిపేందుకు నిక్, ప్రియాంక ఆ ఇంటిని కొనుగోలు చేశారు. 2023 మేలో దాఖలు చేసిన వ్యాజ్యం ప్రకారం.. కొనుగోలు చేసిన తర్వాత ఎదురయ్యే సమస్యలు ప్రకారం ఈ కేసును దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫూల్, స్పా, వాటర్ ఫ్రూఫింగ్ సమస్యలతో వాతావరణం, ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.