Lata Mangeshkar: మాటల్లో చెప్పలేనంత వేదనగా ఉంది.. లతా మంగేష్కర్‌ మరణంపై మోదీ ట్వీట్‌..

Lata Mangeshkar: దేశం గర్వించతగ్గ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ మరణ వార్త విన్న దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన మధుర గానంతో ఎంతో మంది హృదయాలను దోచుకున్న లతా ఇక లేరన్న వార్తను ఆమె అభిమాలనుతోపాటు..

Lata Mangeshkar: మాటల్లో చెప్పలేనంత వేదనగా ఉంది.. లతా మంగేష్కర్‌ మరణంపై మోదీ ట్వీట్‌..

Updated on: Feb 06, 2022 | 11:03 AM

Lata Mangeshkar: దేశం గర్వించతగ్గ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ మరణ వార్త విన్న దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన మధుర గానంతో ఎంతో మంది హృదయాలను దోచుకున్న లతా ఇక లేరన్న వార్తను ఆమె అభిమాలనుతోపాటు సగటు భారతీయ సినీ ప్రేక్షకుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న లతా ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. లతా మంగేష్కర్‌ మరణ వార్త తెలియగానే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు స్పందిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వేదికగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు.

ట్విట్టర్  వేదికగా లతా మంగేష్కర్‌ సేవలను గుర్తు చేస్తూ మోదీ ఎమోషనల్‌ అయ్యారు. గతంలో లతా మంగేష్కర్‌కు నమస్కరిస్తున్న ఓ ఫోటోను షేర్‌ చేసిన మోదీ.. ‘లతా దీదీ మనల్ని వదిలి వెళ్లడం నాకు మాటల్లో చెప్పలేనంత బాధగా ఉంది. ఆమె లేని లోటు పూడ్చలేనిది. తన అద్భుత గాత్రంలో ప్రజలను మంత్ర ముగ్ధులు చేసిన లతాను భావి తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు’ అంటూ రాసుకొచ్చారు నరేంద్ర మోదీ.

ఇదిలా ఉంటే లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని ఆదివారం 11 గంటల తర్వాత బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి నుంచి ఆమె స్వగృహానికి తరలించనున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తారు. అనంతరం దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్క్‌కు తరలిస్తారు. ఇక అంత్యక్రియలు సాయంత్రం 6 గంటల తర్వాత జరగనున్నాయి.

Also Read: Abu Dhabi: లక్ తెచ్చిన లాటరీ టికెట్.. లక్కీడ్రాలో 44 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్న కేరళ యువతి..