Lata Mangeshkar: సిని వినీలాకాశంలో ఒక ధ్రువ తార ఈరోజు నేలకు ఒరిగింది. గానకోకిల లతా మంగేష్కర్ గత కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడి పోరాడి అలసి చివరకు ఈరోజు మృతి చెందారు. భారత చలన చిత్ర పరిశ్రమలో ఒక తీయని గొంతు శాశ్వతంగా ముగాబోయింది. ఆ మధురగానం తిరిగి రాని లోకాలకు చేరుకుంది. ఈ నేపధ్యంలో యావత్ చిత్ర పరిశ్రమతో పాటు.. సంగీత ప్రియులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. లతాజీ మృతి పై ప్రముఖ సిని నటుడు జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందించారు. గానకోకిల లతా మంగేష్కర్ అస్తమయం బాధాకరమని ఆయన అన్నారు.లతా మంగేష్కర్ తుదిశ్వాస విడిచారనే విషయం తీవ్ర ఆవేదనను కలిగించింది. లతాజీ అస్తమయం భారతీయ సినీ సంగీతానికి తీరని లోట ని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. తాను లతాజీ అనారోగ్యం నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు అని తెలుసుకొని స్వస్థత చేకూరింది అనుకొన్నానని.. అయితే ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందన్నారు.
లతాజీ పాటకు భాషాబేధం లేదు. ఆ గళం నుంచి వచ్చిన ప్రతి గీతం సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేసింది… వేలాది గీతాలు ఆలపించిన లతాజీ స్వరం దైవదత్తం అనిపిస్తుందంటూ తనకు లతా మంగేష్కర్ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆమె తెలుగులో కేవలం రెండు పాటలే పాడినా అవి మరచిపోలేనివి. .. నిదురపోరా తమ్ముడా…, తెల్ల చీరకు… పాటలు శ్రోతలను మెప్పించాయని ఇందుకు లతాజీ గానమే కారణమని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. దైవభక్తి మెండుగా కలిగిన లతాజీకి సద్గతులు ప్రాప్తించాలని… ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు పవన్ కళ్యాణ్.
Also Read: