Parineeti Chopra: పరిణితి తొలి ముద్దు ఎప్పుడో తెలుసా.? డేటింగ్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన ముద్దుగుమ్మ..

|

Mar 03, 2021 | 2:55 PM

Parineeti Chopra: 'లేడీస్‌ వర్సెస్‌ రికీ భాల్‌' సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల తార పరిణితీ చోప్రా. తొలి సినిమాతోనే తన నటనతో బీ-టౌన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుందీ బ్యూటీ. మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన..

Parineeti Chopra: పరిణితి తొలి ముద్దు ఎప్పుడో తెలుసా.? డేటింగ్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన ముద్దుగుమ్మ..
Follow us on

Parineeti Chopra: ‘లేడీస్‌ వర్సెస్‌ రికీ భాల్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల తార పరిణితి చోప్రా. తొలి సినిమాతోనే తన నటనతో బీ-టౌన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుందీ బ్యూటీ. మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన నటిగా ఫిలిమ్‌ ఫేర్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యిందంటేనే ఈ అందాల తార క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తోన్న పరిణీతి ఇటీవల సైనా నెహ్వాల్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది.
ఇక కేవలం సినిమాలే కాకుండా ఓటీటీ వేదికల్లో వెబ్‌ సిరీస్‌ల ద్వారా కూడా ప్రేక్షకులను ఆట్టుకుంటోందీ బ్యూటీ. పరిణితి ఇటీవల ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రేన్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ తెరకెక్కిస్తోన్న ఈ వెబ్‌ సిరీస్‌ ఇటీవలే విడుదలై మంచి బజ్‌ సంపాదించుకుంది. ఇక ఈ సమయంలో నెట్‌ఫ్లిక్స్‌ నిర్వహించిన ‘డూ యూ రిబంబర్‌’ చాలెంజ్‌ను స్వీకరించింది. ఈ సందర్భంగా అడిగిన పలువురు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చిందీ అందాల తార. ‘మీరు చివరిగా ఎవరికి మెసేజ్‌ చేశారు.?’ అన్న ప్రశ్నకు తన మేనేజర్‌ నేహా అని సమాధానం ఇచ్చింది. ఇక మీ మొదటి ముద్దు ఎప్పుడు అన్న ప్రశ్నకు.. తడుముకోకుండా 18 ఏళ్లప్పుడు అని చెప్పేసిందీ బ్యూటీ. ఇక డేటింగ్‌ చేశారా.? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తానెప్పుడూ డేట్‌కు వెళ్లలేదని, వాటిపై పెద్ద ఆసక్తి కూడా లేదని పేర్కొంది. డేట్‌ అంటే..’ఇంటికి వచ్చేశెయ్‌..కలిసి భోం చేద్దాం, ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకొని తింటూ చిల్‌ అవుదాం’ అని అంటానని పరిణితి తెలిపింది. ఇక తన ఫస్ట్‌ క్రష్‌ ఎవరన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన పరిణీతి.. సైఫ్‌ అలీఖాన్‌ అని చెప్పింది.

Also Read: Friendship : ఆకట్టుకుంటున్న ‘ఫ్రెండ్ షిప్’ మూవీ టీజర్.. బజ్జీకి ఆల్ ది బెస్ట్ తెలిపిన ఫ్రెండ్స్..

IT Raids In Bollywood: బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తోన్న ఐటీ దాడులు.. నటి తాప్సీతో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో సోదాలు..

Shraddha Kapoor : అందాల కుందనపు బొమ్మ ఈ బాలీవుడ్ భామ… అమ్మడి బర్త్ డేకు వెల్లువెత్తుతున్న విషెస్