ప్రస్తుతం డిప్రెషన్ అనే పదం వినడం సర్వసాధారణమైపోయింది. అయితే ఈ ‘డిప్రెషన్’ అనేది సాధారణ వ్యాధి కాదు. ఇది పెరిగితే ఒక వ్యక్తిలో భయం, ఆందోళన, అనుమానం వంటి లక్షణాలు పెరిగిపోతాయి. అంతేకాదు కొందరు తమ ప్రాణాలను తామే తీసుకునేంటంత వరకూ వెళ్తారు కూడా.. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు కూడా ఈ డిప్రెషన్ బాధితులే.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా డిప్రషన్ బారిన పడి నిండు నూరేళ్ళ జీవితానికి బలవంతంగా ముగింపు పలికారు.. పలుకుతున్నారు కూడా.. తాజాగా ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్యాయత్నం అందరినీ కలిచివేసింది. అతను కూడా డిప్రెషన్ బాధితుడేనని భావిస్తున్నారు. వాస్తవానికి నితిన్ దేశాయ్ మాత్రమే కాదు ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు సైతం డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో డిప్రషన్ తో ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుల గురించి తెలుసుకుందాం..
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 14 జూన్ 2020న బాంద్రాలోని తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడు. అయితే అతని వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే సుశాంత్ చాలా కాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని సన్నిహితుల కథనం. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతని ఇంట్లో కొన్ని మెడికల్ పేపర్లు, యాంటిడిప్రెసెంట్ మెడిసిన్స్ కూడా దొరికాయి.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మలాడ్‌లోని తన కాబోయే భర్త ఇంటిలోని 14వ అంతస్తు నుండి దూకడం లేదా ప్రమాదవశాత్తూ పడిపోవడం వల్ల మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. సలియన్ మరణించిన ఐదు రోజుల తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించాడు.
కుశాల్ పంజాబీ 1977లో జన్మించాడు. అనేక రియాలిటీ షోలు , టీవీ సీరియల్స్‌లో పనిచేశాడు. ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నాడు. 2019 డిసెంబర్ 26న ముంబైలోని తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించాడు. కేవలం 42 సంవత్సరాల వయస్సులో ఈ నటుడు తిరిగిరాని లోకానికి చేరుకున్నాడు. అయితే కుశాల్ పంజాబీ కూడా డిప్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సన్నిహితుల టాక్.
జియా ఖాన్ అసలు పేరు నఫీసా రిజ్వీ ఖాన్. ఆమె 1988లో జన్మించింది. ఆమె బ్రిటిష్ అమెరికన్ నటి. గాయని. 3 జూన్ 2013 జియా తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది. మరణించిన కొన్ని రోజుల తర్వాత జియా ఇంటి నుంచి ఆరు పేజీల సూసైడ్ నోట్ దొరికింది. లేఖలో ఆమె ప్రియుడు సూరజ్ పంచోలీ పేరు ఉంది. జియా కూడా చాలా కాలంగా డిప్రెషన్‌తో బాధపడిందని అంటారు.
బుల్లి తెరపై సంచలన సీరియల్ బాలికా వధులో తెలుగులో చిన్నారి పెళ్లికూతురులోని ‘ఆనంది’ పాత్రను పోషించి ఇంటి పేరుగా మారిన ప్రత్యూష, 1 ఏప్రిల్ 2016న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. ఆమె బిగ్ బాస్ సీజన్ 7లో కూడా కనిపించింది. ప్రత్యూష డిప్రెషన్‌కు గురై చాలా కాలంగా ఇబ్బంది పడిందని స్నేహితులు చెప్పారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..