ShahRukh Khan: డ్రగ్స్‌ కేసులో షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌కు క్లీన్‌చిట్‌.. ఎన్‌సీబీ ఛార్జ్‌షీట్‌లో కనిపించని పేరు..

డ్రగ్స్‌ కేసులో గతంలో ఆర్యన్ అరెస్టు, ఎన్‌సీబీ ఛార్జ్‌షీట్‌లో కనిపించని ఆర్యన్‌ ఖాన్‌ పేరు

ShahRukh Khan: డ్రగ్స్‌ కేసులో షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌కు క్లీన్‌చిట్‌..  ఎన్‌సీబీ ఛార్జ్‌షీట్‌లో కనిపించని పేరు..
Aryan Khan

Edited By:

Updated on: May 27, 2022 | 1:50 PM

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకీ వచ్చింది ఆర్యన్ ఖాన్ పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఛార్జిషీట్‌ను కోర్టులో ప్రవేశపెట్టింది. కాసేపట్లో అది సెషన్స్ కోర్టులో డిపార్ట్‌మెంట్ ముందు దాఖలు చేయబడుతుంది. ప్రత్యేక NDPS కోర్టు ప్రస్తుతం సెలవులో ఉంది కాబట్టి ఛార్జిషీట్ విచారణ తర్వాత మాత్రమే తీసుకోబడుతుంది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో క్రూయిజ్ డ్రగ్స్ కేసు బీటౌన్ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులు భాగంగా ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్సీబీ. ఆర్యన్ ఖాన్ అమాయకుడని.. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది. కోర్టుకు NCB సమర్పించిన చార్జ్‌షీట్‌లో ఆర్యన్‌ పేరు లేదు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురికి సంబంధించి కూడా తగిన సాక్ష్యాలు దొరకలేదని NCB తెలిపింది. కాగా, డ్రగ్స్‌ కలిగి ఉన్నారనే ఆరోపణలపై గతేడాది అక్టోబర్‌ 3న ఆర్యన్‌ను NCB అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో ఆర్యన్‌ 27 రోజుల పాటు జైల్లో గడిపారు. అక్టోబర్‌ 28న బొంబాయి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కాని జైలు నుంచి విడుదలయ్యేందుకు రెండు రోజుల సమయం పట్టింది. కేసు విచారణ సమయంలో అనేక మలుపులు తిరిగాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us