AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naveen Polishetty: ‘నాకు తెలుసు సుశాంత్‌ నువ్వు ఇదంతా చూస్తున్నావని’. ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన జాతిరత్నాలు హీరో..

Naveen Polishetty Emotional Tweet: తాజాగా 2019వ సంవత్సరానికి గాను జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బాలీవుడ్‌ చిత్రం 'చిచోరే'కు ఉత్తమ హిందీ చిత్రంగా..

Naveen Polishetty: 'నాకు తెలుసు సుశాంత్‌ నువ్వు ఇదంతా చూస్తున్నావని'. ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన జాతిరత్నాలు హీరో..
Naveen Polishetty Tweet Abo
Narender Vaitla
|

Updated on: Mar 23, 2021 | 12:17 PM

Share

Naveen Polishetty Emotional Tweet: తాజాగా 2019వ సంవత్సరానికి గాను జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బాలీవుడ్‌ చిత్రం ‘చిచోరే’కు ఉత్తమ హిందీ చిత్రంగా అవార్డు వచ్చింది. ఈ సినిమాలో తెలుగు హీరో నవీన్‌ పొలిశెట్టి కూడా ముఖ్య పాత్ర పోషించాడు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర దారుడిగా దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించాడు. సుశాంత్‌ చివరిసారిగా నటించిన చిచోరేకు నేషనల్‌ అవార్డు రావడంతో ఆ సినిమాలో నటించిన నవీన్‌ పొలిశెట్టి ఎమోషన్‌లకు లోనయ్యాడు. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఓవైపు ‘చిచోరే’కు జాతీయ అవార్డు వచ్చింది. మరోవైపు జాతిరత్నాలు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. సుశాంత్‌.. నువ్వు ఇదంతా చూస్తున్నావని నాకు తెలుసు. ఇది నీకే సొంతం. భాయ్‌ నిన్ను ఎంతగానో మిస్‌ అవుతున్నాను’ అంటూ పోస్ట్‌ చేసిన నవీన్‌ యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇక తాజాగా ప్రకటించిన జాతీయ చలచనిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా ఏకంగా నాలుగు అవార్డులను దక్కించుకోవడం విశేషం. ఇందులో సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమాకు రెండు, నేచురల్‌ స్టార్‌ నాని ‘జెర్సీ’కి మరో రెండు అవార్డులు వచ్చాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ గతేడాది జూన్‌ 14న బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 34 ఏళ్ల అతి పిన్న వయసులో సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడం పట్ల యావత్‌ భారతదేశ సినీ పరిశ్రమ ఒక్కసారిగి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

నవీన్‌ పొలిశెట్టి చేసిన ట్వీట్‌..

Also Read: Kangana Ranaut: నేషనల్ అవార్డ్ చేజిక్కించుకున్న కంగన రనౌత్.. నాలుగుసార్లు జాతీయ పురస్కారం ఆమె సొంతం

Shraddha kapoor: సముద్ర గర్భంలో అందాల తార.. ఆకట్టుకుంటోన్న శ్రద్ధా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో..

పూరీ జగన్నాథ్ న్యూమూవీ అప్‏డేట్.. ఈసారి కన్నడ స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్న మాస్ డైరెక్టర్..