Naseeruddin Shah: నేను ఆ మానసిక సమస్యతో బాధపడుతున్నా.. ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదంటోన్న నసీరుద్దీన్ షా..

బాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నసీరుద్దీన్‌షా (Naseeruddin Shah). తన అసమాన నటనతో పద్మశ్రీ, పద్మభూషణ్‌ లాంటి ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారాయన.

Naseeruddin Shah: నేను ఆ మానసిక సమస్యతో బాధపడుతున్నా.. ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదంటోన్న నసీరుద్దీన్ షా..
Naseeruddin Shah

Updated on: Mar 08, 2022 | 9:55 AM

బాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నసీరుద్దీన్‌షా (Naseeruddin Shah). తన అసమాన నటనతో పద్మశ్రీ, పద్మభూషణ్‌ లాంటి ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారాయన. దర్శకుడిగానూ మెప్పించారు. ఇలా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నసీరుద్దీన్‌షా ఇటీవల తన ఆరోగ్య పరిస్థితి గురించి ఒక ఆసక్తికర విషయం వెల్లడించారు. ‘ఓనోమేటోమానియా’ అనే ఓ అరుదైన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ‘ఏదైనా ఒక పదం కానీ, ఒర వ్యాఖ్యం కానీ, ఓ పాట లేదా పద్యం కానీ, కొన్నిసార్లు మొత్తంగా ఓ సంభాషణని కానీ… ‘ఓనోమేటోమానియా’తో బాధపడే వ్యాధిగ్రస్తుడు… మళ్లీ మళ్లీ వీటిని పలుకుతుంటాడు. ప్రస్తుతం నా పరిస్థితి కూడా అదే. ఇది నన్ను ప్రశాంతంగా నిద్ర పోనివ్వడం లేదు’ అని చెప్పుకొచ్చారు 71 ఏళ్ల నసీరుద్దీన్‌షా.

కాగా ఇటీవల దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటించిన ‘గెహ్రాయియా’ చిత్రంలో నటించారు నసీరుద్దీన్‌షా. అదేవిధంగా ‘కౌన్‌బనేగా శిఖర్‌వతి’ అనే వెబ్ సిరీస్‌లో రాజా మృత్యుంజయసింగ్‌ షెకావత్‌ అనే పాత్రలో కనిపించారు. సోహా అలీఖాన్, లారా దత్తా వంటి తారలు నటించిన ఈ వెబ్‌సిరీస్‌కు పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన ‘కుట్టే’ అనే చిత్రంలో నటించనున్నారు. అర్జున్‌ కపూర్‌, కొంకణా సేన్‌ శర్మ, కుముద్‌ మిశ్రా, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ భరద్వాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Also read:Tamilnadu: బాత్‌రూమ్‌లో జారిపడ్డ మహిళ.. గొంతులో ఇరుక్కుపోయిన టూత్‌ బ్రష్‌.. డాక్లర్లు ఏం చేశారంటే..

Rakul Preet Singh: కండోమ్‌ టెస్టర్‌గా రకుల్‌.. ఆమె తల్లిదండ్రులు రియాక్షన్‌ ఏంటంటే..

Kamareddy: పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యానని ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని.. తల్లడిల్లుతోన్న తల్లిదండ్రులు..