Monalisa: మొదటి సినిమాకు సంతకం చేసిన మోనాలిసా.. హీరో, రెమ్యునరేషన్ డిటెయిల్స్ ఇవే

ఉత్తర ప్రదేశ్ లోనప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాతో వెలుగులోకి వచ్చిన వారిలో మోనాలిసా భోన్ స్లే ఒకరు. తన డస్కీ స్కిన్, తేనె కళ్లతో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయిందీ ముద్దుగుమ్మ. పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునే ఈ అమ్మాయి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది.

Monalisa: మొదటి సినిమాకు సంతకం చేసిన మోనాలిసా.. హీరో, రెమ్యునరేషన్ డిటెయిల్స్ ఇవే
Maha Kumbh Mela Girl Monali

Updated on: Jan 30, 2025 | 3:03 PM

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతోన్న మ‌హా కుంభ‌మేళాలో మోనాలిసా అనే అమ్మాయి త‌న కుటుంబంతో క‌లిసి పూస‌ల దండ‌లు, రుద్రాక్ష‌లు అమ్ముకునేందుకు వ‌చ్చింది. అయితే కొందరు యూట్యూబర్లు ఆమె ఫొటోలు, వీడియోలు తీసి నెట్టింట వైరల్ చేసేశారు. ఇంకే ముంది కొన్ని గంటల్లోనే మోనాలిసా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. ఎక్కడ చూసినా ఆమె ఫొటోలు, వార్తలే కనిపించాయి. ఇదే క్రమంలో మోనాలిసాకు తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తానని బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ప్రకటించాడు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నాడు సనోజ్. ఇచ్చిన మాట ప్రకారం ఆయన మ‌ధ్యప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్‌లోని మోనాలిసా ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె తండ్రికి సినిమా పరిశ్రమ గురించి వివరించారు. అలాగే సందేహాలను క్లియర్ చేశారు. దీంతో ఎట్టకేలకు మోనాలిసా తండ్రి జై సింగ్ భోంస్లే కూడా తన కుమార్తె సినిమాల్లో నటించేందుకు అనుమతించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సనోజ్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నరు.

కాగా సనోజ్ మిశ్రా తెరకెక్కించనున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్‌’ లో మోనాలిసా నటించనుంది. ఇందులో ఆమె రిటైర్డ్ ఆర్మీ అధికారి కూతురిగా కనిపించనుందని సమాచారం. దాదాపు 20 కోట్లు బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. ఈ సినిమా ద్వారానే బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు తెరంగ్రేటం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, మోనాలిసా ఏప్రిల్ నుంచి షూటింగ్ కు హాజరు కానుందట. అక్టోబ‌ర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల తీసుకువ‌చ్చేందుకు చిత్ర బృందం స‌న్నాహాకాలు చేస్తోందట.

మోనాలిసా ఇంటి దగ్గర బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా..

ఇప్పటికే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన మోనాలిసాకు యాక్టింగ్ క్లాసులు అవ‌స‌రం అని డైరెక్టర్ సనోజ్ చెప్పారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి మ‌రో నెల‌రోజుల స‌మ‌యం ఉంద‌ని, అప్ప‌టి వ‌ర‌కు మోనాలిసాకు యాక్టింగ్‌లో శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలో మోనాలిసా పాత్ర‌కు మంచి పేరు వ‌స్తుంద‌న్నాడు సనోజ్ మిశ్రా.

రాజ్ కుమార్ రావు సోదరుడు హీరోగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.