Divya Bharti: దివంగత నటి దివ్య భారతి తండ్రి ఓం ప్రకాష్ భారతి కన్నుమూశారు. ఆయన అక్టోబర్ 30న మరణించారు. బాలీవుడ్‌లో ఓ మీడియా కథనం ప్రకారం.. దివ్య భారతి మాజీ భర్త, చిత్రనిర్మాత సాజిద్ నదియాడ్వాలా తన తల్లిదండ్రులను ఎలా చూసుకున్నారో అదే విధంగా దివ్య భారతి తల్లిదండ్రులను కూడా చూసుకున్నారని తెలిసింది. అంతేకాదు ఓం ప్రకాష్ భారతి చివరి శ్వాస వరకు సాజిద్ దగ్గరే ఉన్నారు.
ఇది మాత్రమే కాదు.. దివ్య భారతి తండ్రి మరణం తరువాత ఆమె తల్లి బాధ్యత కూడా సాజిదే చూసుకుంటున్నాడు. నివేదిక ప్రకారం.. దివ్య భారతి మరణించినప్పుడు సాజిద్ ఆమె తండ్రితోనే ఉన్నాడు. మరుసటి రోజు అంత్యక్రియలు జరిగినప్పుడు కూడా సాజిద్ అక్కడే ఉన్నాడు. సాజిద్ దివ్యభారతి తల్లి దండ్రులను అమ్మా నాన్న అని పిలిచేవాడు. ఇప్పుడు దివ్య భారతి, ఆమె తండ్రి ఓం ప్రకాష్ భారతి ఇద్దరూ ఈ ప్రపంచంలో లేరు.
సాజిద్‌తో వివాహం గురించి రహస్యంగా ఉంచిన దివ్య
దివ్య భారతి ఈ లోకానికి వీడ్కోలు పలికి నేటికి 28 ఏళ్లు. దివ్య జీవితం చాలా చిన్నది కానీ ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. దివ్య భారతి 16 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 19 ఏళ్లకే మరణించింది. మూడేళ్లలో దివ్య స్టార్‌డమ్ సంపాదించింది.’షోలా ఔర్ షబ్నం’ సినిమా సెట్స్‌లో సాజిద్ నడియాడ్‌వాలాతో దివ్య భారతి మొదటి సమావేశం జరిగింది. ఇద్దరూ 1992లో పెళ్లి చేసుకున్నారు.
ఆ సమయంలో దివ్య వయస్సు కేవలం 18 సంవత్సరాలు. ఆమె కెరీర్‌లో పీక్‌లో ఉంది. సాజిద్‌తో వివాహం జరిగిన విషయాన్ని దివ్య భారతి చాలా రోజులు తన తండ్రి ఓం ప్రకాష్ భారతికి తెలియకుండా దాచిపెట్టింది.
1993లో దివ్య భారతి తన ఇంటి బాల్కనీ నుంచి పడి మరణించింది. దివ్య మరణం తరువాత సాజిద్ ఆమెను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే పోలీసులు దానిని ప్రమాదవశాత్తు అని ప్రకటించారు.