Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుట్టినరోజు.. ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు ఇవే.. ఓటీటీలో చూసేయ్యోచ్చు..

పవిత్ర రిష్తా సీరియల్ ద్వారా ఫ్యామిలీ అడియన్స్ కు దగ్గరయ్యాడు సుశాంత్. ఆ తర్వాత 2013లో కై పో చే సినిమా హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత శుద్ధ దేశీ రొమాన్స్, పికె, డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి చిత్రాల్లో నటించారు. 2016లో వచ్చిన ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ సుశాంత్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రూ. 250 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుట్టినరోజు.. ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు ఇవే.. ఓటీటీలో చూసేయ్యోచ్చు..
Sushant Singh Rajput
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 21, 2024 | 12:59 PM

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పుట్టిన రోజు నేడు (జనవరి 21). ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా బుల్లితెరపైకి నటుడిగా అరంగేట్రం చేసి హీరోగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. పవిత్ర రిష్తా సీరియల్ ద్వారా ఫ్యామిలీ అడియన్స్ కు దగ్గరయ్యాడు సుశాంత్. ఆ తర్వాత 2013లో కై పో చే సినిమా హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత శుద్ధ దేశీ రొమాన్స్, పికె, డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి చిత్రాల్లో నటించారు. 2016లో వచ్చిన ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ సుశాంత్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రూ. 250 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులను సొంతం చేసుకున్నాడు. సుశాంత్ నటుడే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే.  హీరోగా వరుస అవకాశాలతో కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే 2020లో జూన్ 14న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్. ఇప్పటికీ అతడి మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని.. హత్య చేశారంటూ అతడి కుటుంబసభ్యులతోపాటు సెలబ్రెటీలు, అభిమానులు వాపోయారు. ఇప్పటికీ సుశాంత్ మరణంపై ఎలాంటి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. దశాబ్దం పాటు కెరీర్‌లో తెరపై కొన్ని మరపురాని పాత్రలను పోషించాడు సుశాంత్. ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సుశాంత్ చిత్రాలు ఇవే..

నెట్‌ఫ్లిక్స్.. చేతన్ భగత్ రచించిన ది 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ నవల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కై పో చే. ఇషాన్ భట్ అనే క్రికెటర్ పాత్రలో సుశాంత్ నటించాడు. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సుశాంత్‌తో పాటు అమిత్‌ సాద్‌, రాజ్‌కుమార్‌ రావ్‌లు కీలకపాత్రలు పోషించారు.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగా వచ్చిన సినిమా.. MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ.. ఈ సినిమాలో ధోని పాత్రలో సుశాంత్ నటించాడు. దిశా పటానీ, కియారా అద్వానీ, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో.. దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించిన చిత్రం డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి. బ్యోమకేష్ బక్షి చేసిన పరాక్రమాలను సినిమాలో చూపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆడలేదు, కానీ సుశాంత్ నటనకు చాలా ప్రశంసలు లభించాయి.

జీ5.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ‘సోంచిరియా’ చిత్రం 2019 సంవత్సరంలో విడుదలైంది. మనోజ్ బాజ్‌పేయి, భూమి పెడ్నేకర్, రణవీర్ షోరే, అశుతోష్ రాణా కీలకపాత్రలు పోషించారు. ‘సోంచిరియా’ చంబల్ జిల్లాకు చెందిన దొంగల జీవితాల ఆధారంగా రూపొందింది.

జీ5.. సుశాంత్ సింగ్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన చిత్రం కేదార్ నాథ్. కేదార్ నాథ్ దర్శనం కోసం వచ్చిన యాత్రికులను సంవత్సరాల తరబడి తన వీపుపై మోస్తున్న మన్సూర్ అనే ముస్లిం బాలుడిగా నటించాడు . కేదార్‌నాథ్‌లో వరదల నేపథ్యంలో దీని కథను రూపొందించారు. ఇది సారా తొలి చిత్రం.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన చిత్రం ఛిచోరే.. 2019లో సుశాంత్ నటించిన చివరి చిత్రం ఇదే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.