Sonu Sood Deep Fake: దారణం.! సోనూ సూద్‌నూ వదలని.. డీప్ ఫేక్‌గాళ్లు.. వీడియో. జర జాగ్రత్త!
సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోస్ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లకు సంబంధించిన ఫేక్ వీడియో వైరలయ్యాయి. రష్మిక మందన్నా, అలియా భట్, కృతి సనన్ ఫేక్ వీడియోస్ వైరలయ్యాయి. అలాగే సచిన్ టెండూల్కర్ వీడియో కూడా బయటపడింది. అయితే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కొందరు ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి జనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు సోనూ సూద్ డీప్ ఫేక్ వీడియోతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు.
సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోస్ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లకు సంబంధించిన ఫేక్ వీడియో వైరలయ్యాయి. రష్మిక మందన్నా, అలియా భట్, కృతి సనన్ ఫేక్ వీడియోస్ వైరలయ్యాయి. అలాగే సచిన్ టెండూల్కర్ వీడియో కూడా బయటపడింది. అయితే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కొందరు ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి జనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు సోనూ సూద్ డీప్ ఫేక్ వీడియోతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. కరోనా కష్ట సమయాల్లో ఎంతో మందికి అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనుసూద్. కానీ ఇప్పుడు కొందరు ఆకతాయిలు అతడి ఫేక్ వీడియో క్రియేట్ చేసి అభిమానుల నుంచి డబ్బులు అడుగుతున్నారు. దీంతో ఈ వీడియో విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ.. సూచించాడు సోనూ సూద్. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన.. సోనూసూద్. కొందరు తన డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి అభిమానులతో చాటింగ్, వీడియో కాల్ చేస్తూ డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారన్నారు. చాలా మంది అమాయకులు ఆ వీడియోలో ఉన్నది తానే అనుకొని సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారన్నారు. ఇలాంటి వీడియో కాల్స్ వస్తే నమ్మకండని.. జాగ్రత్తగా ఉండాలన్నారు. అయితే సోనూసూద్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

