AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal OTT: యానిమల్‌కు బిగ్ పంచ్‌.! OTT రిలీజ్ కు అడ్డంకులు.

Animal OTT: యానిమల్‌కు బిగ్ పంచ్‌.! OTT రిలీజ్ కు అడ్డంకులు.

Anil kumar poka
|

Updated on: Jan 21, 2024 | 12:46 PM

Share

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. రణబీర్ కపూర్, రష్మిక మందన, అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘యానిమల్’ డిసెంబర్ 1, 2023న విడుదలైంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో పాటు కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంది. సినిమాలో హింస ఎక్కువ చూపించారని.. అలాగే మహిళలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ కొందరు..

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. రణబీర్ కపూర్, రష్మిక మందన, అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘యానిమల్’ డిసెంబర్ 1, 2023న విడుదలైంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో పాటు కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంది. సినిమాలో హింస ఎక్కువ చూపించారని.. అలాగే మహిళలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 26న విడుదల కానుంది. కానీ ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు బిగ్ పంచ్‌ పడింది.

ఈ సినిమా ఓటీటీ విడుదలను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు సమన్లు ​​జారీ చేసింది. ‘యానిమల్’ OTT విడుదలపై స్టే విధించాలని కోరుతూ సినీ వన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు నెట్‌ఫ్లిక్స్ అలాగే నిర్మాతలకు సమన్లు ​​జారీ చేసింది. ముగ్గురు ప్రతివాదులు సమర్పించిన పత్రాలను అంగీకరిస్తూ లేదా తిరస్కరిస్తూ అఫిడవిట్‌లు దాఖలు చేసే వరకు, వ్రాతపూర్వక స్టేట్‌మెంట్‌లు రికార్డులో అంగీకరించబడవని జస్టిస్ సంజీవ్ నరులా తెలిపారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి రెండు నిర్మాణ సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందని సినీ వన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. అయితే టి-సిరీస్‌ 2019 కొనుగోలు ఒప్పందంలోని వివిధ నిబంధనలను ఉల్లంఘించినట్లు వారు పేర్కొన్నారు. దీనితో పాటు, ‘యానిమల్’ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ లో విడుదల చేయకూడదని కూడా డిమాండ్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos