Lata Mangeshkar: హేమ నుంచి లతగా మారిన నైటింగేల్ లతా మంగేష్కర్ జీవిత ప్రయాణంలోని ముఖ్య విషయాలు

| Edited By: Ravi Kiran

Feb 06, 2022 | 10:42 AM

Lata Mangeshkar: భారత చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. భారతీయ నైటింగేల్ లతా మంగేష్కర్ మధుర గానం మూగబోయింది. సినీ నేపధ్య గాయనిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర..

Lata Mangeshkar: హేమ నుంచి లతగా మారిన నైటింగేల్ లతా మంగేష్కర్ జీవిత ప్రయాణంలోని ముఖ్య విషయాలు
Lata Mangeshkar
Follow us on

Lata Mangeshkar: భారత చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. భారతీయ నైటింగేల్ లతా మంగేష్కర్ మధుర గానం మూగబోయింది. సినీ నేపధ్య గాయనిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన లతామంగేష్కర్ తన 92 వ ఏట తుడి శ్వాస విడిచారు. ఈ లెజెండరీ సింగర్ గా 13 ఏళ్ళ వయసులో గాయనిగా సినీ జర్నీని ప్రారంభించి.. సుమారు 78 ఏళ్ళు సుదీర్ఘ ప్రయాణం చేశారు. 980 సినిమాలలో పాటలను పాడారు. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాట వరకూ సాగింది. 1942లో మరాఠీ చిత్రంలో హీరోయిన్ చెల్లెలుగా నటించి రెండు పాటలు పాటలను పాడారు. ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా పాటతో మొదలైన లతా మంగేష్కర్ కళాప్రయాణంలో కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం..

లతా బాల్యం కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు సంగీతాన్ని వినడం, పాడడంతప్ప మరోలోకం లేదు. తాను చదువుకోలేకపోయినా తన తర్వాతివారైనా పెద్దచదువులు చదవాలనుకొంది. అయితే వారుకూడా చదువుకన్నా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడ్డారు.

* 1942 లో మరాఠీ చిత్రం కిటి హసల్ సినిమాలో లత మొదటి పాటను పాడారు. అయితే ఆ పాట సినిమా నుంచి కట్ చేశారు. దీంతో ఇప్పటికీ ఆ పాట రిలీజ్ కాలేదు.

* తండ్రి దీనానాథ్ మంగేష్కర్ కు లతా మంగేష్కర్ తల్లి రెండో భార్య. తండ్రి సుప్రసిద్ధ సంగీతకారుడు. ఈ దంపతులకు లత 1929 సెప్టెంబరు 28 న జన్మించారు.

* లతా మంగేష్కర్ కు మీనా, ఆశా భోంస్లే, ఉషా, హృదయనాథ్ అనే నలుగురు తోబుట్టువులు. ఆశా భోంస్లే కూడా ప్రముఖ నేపధ్య గాయని.

* నిజానికి లత పుట్టిన సమయంలో పెట్టిన పేరు హేమ.. అయితే తండ్రి నటిస్తున్న “భవ బంధన్” నాటకంలో లతిక అనే పాత్రలో నటించారు. అప్పటి నుంచి హేమ పేరు లత గా మారిపోయింది. లతా మంగేష్కర్ గా ప్రఖ్యాతి గాంచారు.

* లతా మంగేష్కర్.. ఆనంద్ఘన్ అనే పేరుతో కొన్ని మరాఠీ చిత్రాలకు సంగీతం అందించారు.

* జనవరి 27, 1963 న న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో లతా పాడిన “ఏ మేరే వతన్ కే లోగాన్” దేశభక్తి గీతం వింటూ అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కంటతడి పెట్టారు. ఈ పాట 1962 యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు అంకితం చేశారు.

* గాయకుడు సంగీత దర్శకుడు గులామ్ హైదర్‌ను తన గాడ్ ఫాదర్‌గా భావిస్తారు. లతా సంగీత ప్రతిభపై విశ్వాసం చూపించడమే కాదు.. ఎన్నో అవకాశాలు ఇచ్చారు.

Also Read:

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూత.. లైవ్ వీడియో

లక్ తెచ్చిన లాటరీ టికెట్.. లక్కీడ్రాలో 44 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్న కేరళ యువతి..