KL Rahul-Athiya Shetty: ఇదిగో కేఎల్ రాహుల్, అతియాల కుమార్తె! నెట్టింట ఫొటో వైరల్.. అసలు విషయమిదే

|

Mar 25, 2025 | 10:52 PM

టీమిండియా స్టార్ క్రికెటర్, బాలీవుడ్ నటి అతియా శెట్టి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.అతియా శెట్టి సోమవారం (మార్చి 24) ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇదే క్రమంలో కేఎల్ రాహుల్, అతియా ఓ పాపను చేతిలోకి తీసుకుని ఉన్న ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

KL Rahul-Athiya Shetty: ఇదిగో కేఎల్ రాహుల్, అతియాల కుమార్తె! నెట్టింట ఫొటో వైరల్.. అసలు విషయమిదే
KL Rahul, Athiya Shetty
Follow us on

బాలీవుడ్ నటి అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. అతియా శెట్టి ఒక పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు రాహుల్, అతియా. ‘అందరి ఆశీస్సులతో, మాకు మార్చి 24, 2025న ఒక కూతురు పుట్టింది’ అని తమ పోస్ట్‌లో పేర్కొన్నారీ లవ్లీ కపుల్. ఇందులో రెండు ఫ్లెమింగోలను కూడా చూపించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పలువురు సినీ, క్రీడా ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రాహుల్- అతియా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే సమయంలో కెఎల్ రాహుల్, అతియాలు ఒక పాపను తమ చేతుల్లోకి తీసుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ఆమె కూతురి ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. కొందరైతే ఈ ఫొటో నిజమనుకున్నారు కూడా. ఈ ఫొటో పూర్తి గా అవాస్తవం. ఆడబిడ్డ జన్మించిన విషయాన్ని కేఎల్‌ రాహుల్‌, అతియా శెట్టి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న కొన్ని గంటల్లోనే ఈ ఏఐ జనరేటెడ్‌ ఇమేజ్‌ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం అయ్యింది. చూడ్డానికి అచ్చం ఒరిజినల్‌ ఫొటోను పోలి ఉన్న ఈ ఇమేజ్‌ను నిజమే అనుకుని చాలా మంది నెట్టింట షేర్‌ చేస్తున్నారు.

ఈ ఫొటో ఫేక్ అని ఎలా నిర్ధారించవచ్చంటే.. కేఎల్‌ రాహుల్‌ గానీ, అతడి భార్య అతియా శెట్టి గానీ తమ కుమార్తె ఫొటోను షేర్‌ చేయలేదు. అలాగే కేఎల్‌ రాహుల్‌కు మామ, అతియా శెట్టి తండ్రి బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కూడా సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్‌ పెట్టలేదు. ఇక కేఎల్ రాహుల్ ప్రస్తుతం జుల పాల జుట్టుతో ఉన్నాడు. కానీ ఈ ఏఐ ఫొటోలో మాత్రం క్లీన్ హెయిర్ కట్ తో కనిపించాడు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. కేఎల్‌ రాహుల్‌ కుమార్తె జన్మించడానికి నెల రోజుల ముందే ఇదే తరహా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

ఇవి కూడా చదవండి

అతియా శెట్టి, కెఎల్ రాహుల్ లది ప్రేమ వివాహం. వీరు రెండు సంవత్సరాల క్రితం జనవరి 23, 2023న వివాహం చేసుకున్నారు. వీరిద్దరి వివాహం ఖండాలాలోని సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, క్రికెటర్లు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆ తర్వాత, నవంబర్ 8న, తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. అతియా. దీంతో అప్పటి నుంచే ఈ ఏఐ ఫొటోలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కొందరు వాటిని ధ్రువీకరించుకోకుండానే అభినందనలు తెలియజేశారు కూడా.

కేఎల్ రాహుల్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.