Kartik Aaryan: ఆ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదు.. అలాంటివి ఎందుకు రాయరు.. హీరో అసహనం..

|

Jun 09, 2024 | 12:31 PM

దీంతో సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్, ఇతర నటీనటులకు సరైన డబ్బు అందడం లేదని చర్చ నడుస్తుంది. అయితే తాజాగా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ రెమ్యునరేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్. సినిమా బడ్జెట్, నిర్మాత పరిస్థితిని బట్టి హీరోలు పారితోషికం తగ్గించుకుంటారని.. కొన్నిసార్లు రెమ్యునరేషన్ పూర్తిగా వదిలేస్తారని అన్నారు. ప్రస్తుతం చందు ఛాంపియన్ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న కార్తిక్ ఆర్యన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Kartik Aaryan: ఆ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదు.. అలాంటివి ఎందుకు రాయరు.. హీరో అసహనం..
Karthik Aaryan
Follow us on

ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్టార్ హీరోల రెమ్యునరేషన్ అధికంగా ఉందని.. దీంతో నిర్మాతలపై ఎక్కువగా భారం పడుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. సినిమా బడ్జెట్‏లో దాదాపు హీరోలకే సగం వరకు పారితోషికం వెళ్తుందని.. అందుకే మూవీస్ నిర్మాణ వ్యయం పెరుగుతుందంటూ చాలాసార్లు విమర్శలు వచ్చాయి. అలాగే కొందరు స్టార్స్ తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి ఇష్టపడడం లేదని ప్రచారం నడిచింది. దీంతో సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్, ఇతర నటీనటులకు సరైన డబ్బు అందడం లేదని చర్చ నడుస్తుంది. అయితే తాజాగా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ రెమ్యునరేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్. సినిమా బడ్జెట్, నిర్మాత పరిస్థితిని బట్టి హీరోలు పారితోషికం తగ్గించుకుంటారని.. కొన్నిసార్లు రెమ్యునరేషన్ పూర్తిగా వదిలేస్తారని అన్నారు. ప్రస్తుతం చందు ఛాంపియన్ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న కార్తిక్ ఆర్యన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

గతంలో తాను నటించిన షెహజాదా సినిమా సమయంలో ఆర్థిక పరిమితుల కారణంగా తన రెమ్యునరేషన్ వదులుకున్నట్లు చెప్పాడు. “స్టార్ హీరోస్ రెమ్యునరేషన్ గురించి చర్చ స్టార్ట్ కాకముందే నేను షెహజాదా సినిమా చేశాను. అప్పుడు చిత్ర నిర్మాతల దగ్గర సరిపడా బడ్జెట్ లేకపోవడంతో నేను నా రెమ్యునరేషన్ వదిలేసుకున్నాను. పారితోషికం తీసుకోలేదని సినిమా నిర్మాతల్లో నేను ఒకడినని క్రెడిట్ ఇచ్చారు. ఇలాంటివి ఎవరూ రాయరు. నేను కాదు.. చాలా మంది స్టార్స్ నిర్మాతల కోసం ఆలోచించి చాలా సాయం చేస్తుంటారు. వారికి తోడుగా ఉంటారు. డైరెక్టర్, యాక్టర్స్, నిర్మాతలు ఇలా ప్రతి ఒక్కరూ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి ఆలోచిస్తారు. ఎవరూ దానిని సాగదీయాలని చూడరు. సినిమా ఉంటే ఏంటీ.. పోతే ఏంటీ.. నాకైతే నా డబ్బులు ఇవ్వాల్సిందే అని ఎవరు మాట్లాడరు. అలా చేస్తే ఆ సినిమా ఎప్పటికీ విడుదల కాదు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కార్కిక్ ఆర్యన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం షెహజాదా. తెలుగులో సూపర్ హిట్ అయిన అల వైకుంఠపురంలో సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భూషణ్ కుమార్, అల్లు అరవింద్, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించగా.. ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. దాదాపు 65 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ47 కోట్లు గ్రాస్ రాబట్టింది. ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ సినిమా జూన్ 14న అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.