
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ఏడాది జూన్ 14న విడుదల చేయనున్నట్లు తెలిపారు. “ఇండియా చీకటి రోజుల వెనక స్టోరీని చూడండి. జూన్ 14న ‘ఎమర్జెన్సీ’ రిలీజ్ అవుతుంది. ఎమర్జెన్సీ నాకు చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. మణికర్ణిక తర్వాత నేను డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. ఈ పెద్ద ప్రాజెక్ట్ కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులు పనిచేశారు. ఇదొక పీరియాడిక్ డ్రామా” అని తెలిపింది కంగనా. నిజానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. గతేడాది నవంబర్ 24న విడుదలైన కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేసింది చిత్రయూనిట్. చాలా రోజులుగా కంగనా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు కంగనా ఆశలు పెట్టుకున్నారు.
తాజాగా మంగళవారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. 1975 జూన్ 25న ఇందిరా గాంధీ భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పటి నుంచి టీజర్ స్టార్ట్ అవుతుంది. దివంగత ప్రధాని స్వరానికి సరిపోయేలా కంగనా మాడ్యులేట్ వాయిస్ సరిగ్గా సరిపోయింది. ఈ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు. అలాగే మాజీ ప్రదాని అటల్ బిహారీ వాజ్ పేయి పాత్రలో శ్రేయాస్ తల్పడే కనిపించనున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ.. నిర్మాతగానూ వ్యవహరించారు కంగనా. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో నటించారు.
ఎమర్జెన్సీ సినిమా కోసం తాను ఇన్నాళ్లుగా ఒక నటిగా సంపాదించిన ఆస్తి మొత్తాన్ని తాకట్టు పెట్టానని.. ఎమర్జెన్సీ అనేది తనకు సినిమా మాత్రమే కాదని.. ఒక వ్యక్తిగా.. తన విలువ, పాత్రకు పరీక్ష అని గతంలో అన్నారు కంగనా. మొదటి షెడ్యూల్ సమయంలో డెంగీ బారినపడి రక్తకణాల సంఖ్య భారీగా పడిపోయినా షూట్ లో పాల్గొనాల్సి వచ్చిందన్నారు. ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు అడియన్స్ ముందుకు రాబోతుంది. మాజీ ప్రదాని ఇందిరా గాందీ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.