
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ’12వ ఫెయిల్’ సూపర్ హిట్‌గా నిలిచింది. విక్రాంత్ మాస్సే, మేధా శంకర్ తదితరులు నటించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోని రికార్డులు సృష్టిస్తోంది. విధు వినోద్ చోప్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమా విజయంతో అందరూ సంబరాలు చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రముఖ నటి కంగనా రనౌత్ కూడా 12th ఫెయిల్ సినిమాపై ప్రశంసలు కురిపించింది. హీరో విక్రాంత్ మాస్సే అభియనంపై ప్రశంసలు కూడా కురిపించింది. ఇక దర్శకుడు విధు వినోద్ చోప్రా పనితనాన్ని కంగనా మెచ్చుకుంది. అయితే ఇప్పుడు హఠాత్తుగా దర్శకుడి భార్య అనుపమ చోప్రాపై కంగనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సోషల్ మీడియా వేదికగా అనుపమపై సంచలన ఆరోపణలు చేసిందీ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. క అనుపమ చోప్రా ఫిల్మ్ క్రిటిక్, ఫిల్మ్ జర్నలిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని దాదాపు స్టార్ సెలబ్రిటీలందరినీ ఇంటర్వ్యూ చేసిందామె. ఆమె తన సొంత YouTube ఛానెల్, వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తోంది. అందుకే బాలీవుడ్ లో అనుపమకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈనేపథ్యంలో కంగనా రనౌత్ డైరెక్టర్ భార్యపై సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
‘విధు సర్ భార్య అనుపమ చోప్రా సినిమా జర్నలిస్టుగా ఇండస్ట్రీకి చాలా ప్రమాదకరం. వారు బయటి వ్యక్తులను బాగా ద్వేషిస్తారు. వారు ప్రతిభావంతులైన, యువకులను చూస్తే అసూయపడతారు. తన భర్తపై కూడా ఈర్ష్య పడడంలో ఆశ్చర్యం లేదు. అనుపమ చోప్రా తన భర్త కీర్తి కారణంగా డబ్బు, కీర్తిని సంపాదించింది. వెబ్‌సైట్, యూట్యూబ్‌లతో వ్యాపారాన్ని నడుపుతోంది. ఆమె దర్శకుడి భార్య అని చెప్పుకుంటూ బాలీవుడ్ పార్టీలకు వస్తుంది. బాలీవుడ్ గాసిప్ గ్యాంగ్‌లో చేరి నిజమైన టాలెంట్, మంచి సినిమాలకు వ్యతిరేకంగా పని చేస్తోంది’ అని కంగనా తన ట్వీట్లలో ఆరోపించింది. ’12వ ఫెయిల్’ సినిమాను నేరుగా థియేటర్లలో విడుదల చేయవద్దని అనుపమ చోప్రా విధు వినోద్ చోప్రాకు సూచించిందట. ఈ చిత్రాన్ని ఎవరూ థియేటర్‌లో చూడరని అందట. కానీ భార్య మాటలను పట్టించుకోకుండా విధు వినోద్ చోప్రా ‘12వ ఫెయిల్’ సినిమాను థియేటర్లలో విడుదల చేశాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది. తర్వాత ఓటీటీలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.
Vidhu sir’s wife @anupamachopra is a disgrace in the name of film journalist, she is not only xenophobic but also deeply jealous and insecure of younger and intelligent women, no wonder she is jealous of her own husband, on whose name and wealth she built her website and other… pic.twitter.com/u6SchlUehk
— Kangana Ranaut (@KanganaTeam) February 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.