Kangana Ranaut: గుర్రపు స్వారీ చేస్తున్న కంగనా.. ఆశ్చర్యపోతున్న అభిమానులు.. వైరల్ అవుతున్న వీడియో..

Kangana Ranaut: కంగనా రనౌత్.. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క్వీన్ అనే నిరూపించుకుంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద

Kangana Ranaut: గుర్రపు స్వారీ చేస్తున్న కంగనా.. ఆశ్చర్యపోతున్న అభిమానులు.. వైరల్ అవుతున్న వీడియో..
Kangana Ranaut

Updated on: Jun 14, 2021 | 9:52 PM

Kangana Ranaut: కంగనా రనౌత్.. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క్వీన్ అనే నిరూపించుకుంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కంగనా.. తాజాగా ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో కంగనా.. అలవోకగా…గుర్రపు స్వారీ చేస్తూ కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కంగనా గుర్రపు స్వారీ చేయడం చూసిన నెటిజన్లను ఆకట్టుకుంటుంది. వావ్.. అద్భుతం.. చాలా బాగా గుర్రపు స్వారీ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కంగనా.. మణికర్ణిక.. సినిమా కోసం తనను తాను పూర్తిగా మార్చుకుంది. అందులో స్టంట్స్ కోసం అప్పుడే ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంది.

ట్వీట్..

కంగనా.. సినిమాల కోసం పూర్తిగా కష్టపడుతుంది. ఇటీవల తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమాలో కంగనా నటించింది. ఇందులో అచ్చం జయలలిత మాదిరిగా కనిపించడానికి.. కంగనా ఏకంగా 20 కిలోల బరువు పెరిగింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ఏప్రిల్ 23న విడుదల చేయాల్సి ఉండగా.. కరోనా అడ్డం పడింది. దీంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఈ మూవీని విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జులై చివరి వారంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట మేకర్స్..

Also Read: YSR Vahana Mitra: కష్టకాలంలో ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు ఊరట.. రేపు వైఎస్సార్‌ వాహన మిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ!

మీ కలలో శంఖం కనిపిస్తే అర్థం ఎంటో తెలుసా…. ఏ వస్తువులు కనిపిస్తే మంచిది.. ఏవి కనిపిస్తే అశుభమో తెలుసా..

CJI NV Ramana Yadadri tour: రేపు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడిని దర్శించుకోనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు