Kangana Ranaut : ఆ స్టార్ హీరో నాకు రహస్యంగా కాల్ చేసాడు.. షాకింగ్ విషయం చెప్పిన కంగనా..
కాంట్రవర్సీ క్వీన్ గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ కంగనా సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువ ఫెమస్ అయ్యింది. సుశాంత్ మరణమే తర్వాత మరింత రెచ్చిపోయిన ఈ అమ్మడు బాలీవుడ్ పెద్దలపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి సెన్సేషనల్ అయ్యింది.
Kangana Ranaut:
కాంట్రవర్సీ క్వీన్ గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ కంగనా సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువ ఫెమస్ అయ్యింది. సుశాంత్ మరణమే తర్వాత మరింత రెచ్చిపోయిన ఈ అమ్మడు బాలీవుడ్ పెద్దలపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి సెన్సేషనల్ అయ్యింది. ఆతర్వాత ఏకంగా రాజకీయ నాయకులను ఛాలెంజ్ చేస్తూ మరింత రచ్చచేసింది . ఇలా నిత్యం వివాదాల్లో ఉండే కంగనా.. తాజాగా మరోసారి బాంబ్ పేల్చింది. ఇప్పటికే బాలీవుడ్ లో మాఫియా ఉందంటూ రెచ్చిపోయిన ఈ బ్యూటీ అటు స్టార్ హీరోలపై పలు వివాదాస్పద వ్యాఖ్యలుచేసింది. తాజాగా యాక్షన్ హీరో అక్షయ్ ఖాన్ పై సంచలన కామెంట్లు చేసింది.
తన సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ నచ్చి తనను మెచ్చుకోవాలంటే బాలీవుడ్ స్టార్స్ డైరెక్ట్ గా మెచ్చుకోరని రహస్యంగా కాల్ చేస్తారని చెప్పుకొచ్చింది. వీళ్లంతా బహిరంగంగా తనని పొగిడితే మాఫియా నుంచి సమస్యలు ఎదుర్కొంటారని అందుకే వారు ఎవరూ అలా చేయరని అంది కంగనా. అక్షయ్ కుమార్ వంటి పెద్ద స్టార్ నుండి రహస్య కాల్స్ వచ్చాయని కంగనా రనౌత్ అన్నారు. తలైవి ట్రైలర్ ని ఆయన రహస్యంగా కాల్ చేసి ప్రశంసించారట. ఇక చాలా మంది బాలీవుడ్ నాయికలు తనకు రహస్యంగా కాల్ చేసి ప్రశంసించారని తెలిపారు. మిగతా హీరోయిన్స్ అయితే బహిరంగంగానే ప్రశంసిస్తారని తనను మాత్రం ఇలా రహస్యంగా పొగుడుతారని చెప్పుకొచ్చింది కంగనా. ప్రస్తుతం జయలలిత జీవిత కథతో తెరకెక్కుతున్న తలైవి సినిమాలో నటిస్తుంది కంగనా. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :
Upasana Konidela: సురక్షితంగా ఉన్నామా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటున్న కొణిదల వారి కోడలు..
Heroine Anjali: వకీల్ సాబ్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో చిత్రయూనిట్ ..
Jathi Ratnalu Movie: ఓటీటీలోకి వస్తోన్న ‘జాతిరత్నాలు’.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే.!