Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్వీన్ కంగనా రనౌత్ దేశం పేరును భారత్‌గా మార్చాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరారు. ఇండియా అనేది బానిస పేరని కూ ద్వారా తెలిపారు. భారత దేశంలో మన ఆధ్యాత్మిక విలువలను, జ్ఞానాన్ని విస్తరింపజేయాలని.. అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుందని.. అంతేకానీ విదేశీయులకు ప్రతి రూపంగా భారత దేశము పాలన చేస్తే.. ఎప్పటికీ మనదేశం అభివృద్ధి చెందదని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు .. ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చూస్తున్నాయని.. మన నాగరికతను అభ్యివృధి చేస్తే.. ఉన్నత స్థాయికి భారత్ చేరుకుంటుందని చెప్పింది కంగనా.. మన సంస్కృతీ, సంప్రదాయాలను , ఆధ్యాత్మకతను పాటిస్తూ.. మన వేదాలను, యోగాను మరింత విస్తరిస్తే.. భారత్ ప్రపంచాన్ని శాసించే దిశగా ఎదుగుతుందని.. లేదంటే పాశ్చాత్య ప్రపంచానికి కాపీగానే మిగిలిపోతామని అన్నారు.
ఇక నైనా బానిస పేరు ఇండియాను భారత్ గా మార్చండని కోరారు. మనదేశాన్ని పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం ఇండియా అనే బానిస పేరును ఇచ్చిందని.. అంటే వాస్తవంగా సింధు నదికి తూర్పు అని అర్థమని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. మనం మన పిల్లలన్ని తక్కువ జాతి, చిన్న ముక్కు ఇలా విచిత్రమైన పేర్లతో పిలవగలమా.. వాటిని సమూలంగా మార్చేయాలని చెప్పారు. ”భారత్‌కు అసలైన నిర్వచనం నేను చెబుతాను .. ఇది మూడు సంస్కృత పదాలతో మిళితమైంది .. భా (భావం) ర (రాగం) త (తాళం)” అని కంగనా సోషల్ మీడియా వేదికగా భారత్ కు అసలైన అర్ధం ఇదంతా తెలిపింది కంగనా.
భారతీయులు సాంస్కృతిక, కళాత్మక, నాగరికత కలిగిన వారని.. ప్రతి పేరుకి ఒక వైబ్రేషన్ ఉంటుందన్న విషయం బ్రిటిష్ వారికి తెలుసునని, అందుకే వారు అనేక ప్రాంతాలకు పేర్లు మార్చారని చెప్పారు..స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లు అయ్యింది. ఇక నైనా మనం కోల్పోయిన కీర్తి ప్రతిష్టలను తిరగి పొందాలి.. అది మొదట.. ఇండియా అనే బానిస పేరును మార్చి ‘భారత్’ పేరుతో ప్రారంభిద్ధామని పిలుపునిచ్చారు కంగనా రనౌత్
Also Read: భారతీయ యాప్ ‘కూ’ లో చేరిన అనుష్క..ఇక నుంచి కూ లోనే అన్ని విషయాలను షేర్ చేస్తానన్న దేవసేన