John Abraham : షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్‌ హీరో జాన్ అబ్రహం.. రక్తం తుడుచుకుంటున్న వీడియో వైరల్..

|

Feb 15, 2021 | 6:36 PM

John Abraham : బాలీవుడ్ హ్యాండ్‌సమ్‌ హీరో జాన్‌ అబ్రహం ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సత్యమేవ జయతే 2’ షూటింగ్

John Abraham : షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్‌ హీరో జాన్ అబ్రహం..  రక్తం తుడుచుకుంటున్న వీడియో వైరల్..
Follow us on

John Abraham : బాలీవుడ్ హ్యాండ్‌సమ్‌ హీరో జాన్‌ అబ్రహం ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సత్యమేవ జయతే 2’ షూటింగ్ కంప్లీట్ చేసి, రీసెంట్‌గా ‘అటాక్’ సినిమా చిత్రీకరణ ప్రారంభించిన జాన్ అబ్రహం ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు గాయపడిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

లైట్‌తో తన మెడపై కొట్టిన ఫొటో షేర్ చేసిన హీరో.. దాని వల్ల కలిగిన గాయాలకు రక్తం తుడుచుకుంటున్న వీడియోను యాడ్ చేశారు. ‘ఎలా ప్రారంభమైంది.. ఇప్పుడు ఏం జరుగుతోంది.. లవ్ దిస్.. ఆల్ పార్ట్ ఆఫ్ ఫన్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు క్యాప్షన్ జత చేశారు. ఇక ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్‌ నుంచి షేర్ చేసిన బైక్ స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మళ్లీ ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారుతోంది. దీనిపై జాన్ అబ్రహం అభిమానులు తీవ్రంగా రియాక్ట్‌ అవుతున్నారు. వరుసగా కామెంట్లు పోస్ట్‌ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇష్టమైన హీరోకు ఏం కాకూడదంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు.