Jagapathi Babu : జగపతి బాబు గురించి ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన నటనతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. జగపతిబాబు చేస్తున్న సినిమాలకు యువత నుంచి మహిళల మంచి స్పందన వస్తోంది. విలన్ గా, తండ్రిగా, వ్యాపారవేత్తగా ఆయన పోషిస్తున్న పాత్రలు ఆయనకు మంచి పేరు తీసుకొస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో జగపతిబాబు నిర్మాతగా కూడా మారే ఆలోచనలో ఉన్నారు అని ప్రచారం కూడా కొంతవరకు జరుగుతోంది. ఒకప్పుడు ఆర్థికంగా నష్టపోయిన జగపతిబాబు మళ్లీ సినిమాలు వరుసగా రావడంతో ఆర్ధికంగా, సినిమాల పరంగా నిలబడ్డారు. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఆయనకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్నటువంటి ఒక సినిమాలో జగపతిబాబుని విలన్ గా తీసుకుంటున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తెలుగులో ఆయనకు మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఆయనను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని అక్షయ్ కుమార్ భావించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో జగపతి బాబు, అక్షయ్ కుమార్ కి తండ్రిగా నటిస్తారని కానీ ఆయన ఈ సినిమాలో విలన్ అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. విలన్ గా జగ్గు భాయ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ సినిమాను మరో టాలీవుడ్ హీరోతో కలిసి అక్షయ్ కుమార్ నిర్మిస్తున్నారని, అందులో తెలుగు సినీ రంగం నుంచి జగపతిబాబుని, తమిళ సినీ రంగం నుంచి మరో స్టార్ ను కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగు తో పాటు తమిళంలో కూడా విడుదలయ్యే అవకాశం ఉందని కూడా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
My future career look. pic.twitter.com/6zF5gjwxxV
— Jaggu Bhai (@IamJagguBhai) June 9, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :