Rashmika Mandanna: కన్నడలో వచ్చిన కిరిక్ పార్టీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల నటి రష్మిక మందన్న. ఆ తర్వాత తెలుగులో వచ్చిన ఛలో చిత్రంతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ చిన్నది ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు, భారీ సక్సెస్‌లతో లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో మంచి విజయాలను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ ఆఫర్లను సైతం సొంతం చేసుకుందీ బ్యూటీ.
మిషన్ మజ్ను, గుడ్‌బై వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఇదే సమయంలో వచ్చిన పుష్ప సినిమా రష్మిక కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యావత్ దేశవ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేసుకోవడంతో రష్మిక పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో డీగ్లామర్ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో బాలీవుడ్‌లోనూ రష్మికకు క్రేజ్ పెరిగింది. ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారిన ఈ అమ్మడుకి బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు క్యూకడుతున్నట్లు తెలుస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా రష్మిక బాలీవుడ్‌లో ఓ భారీ ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ అగ్ర నిర్మాతాల్లో ఒకరైన కరణ్ జోహార్ రష్మికకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్తకు బలాన్ని చేకూరుస్తూ ఇటీవల రష్మిక కరణ్ ఆఫీస్ వద్ద కనిపించిన దృశ్యాలు బాలీవుడ్ మీడియాకు చిక్కాయి. దీంతో కరణ్ ప్రొడ్యుసింగ్‌లో రష్మిక నటించడం కాన్ఫామ్ అనే వార్తలు జోరందుకున్నాయి. మరి ఈ వార్తల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక రష్మిక ప్రస్తుతం తెలుగులో పుష్స ది రూల్‌తో పాటు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల్లో నటిస్తోంది.
Also Read: Railway Track Facts: రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి కారణం ఏమిటి..?
Viral Video: అమెజింగ్.. ఈ పిల్లి ఐడియాలే వేరప్ప.. వీడియో చూస్తే మీరే షాకవుతారు..