Akshay Kumar: ఓ మై గాడ్‌ 2 సినిమాపై హిందూ సంఘాల ఆగ్రహం.. అక్షయ్‌ను చెంప దెబ్బకొడితే రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటన

|

Aug 12, 2023 | 11:47 PM

ఇందులో అక్షయ్ కుమార్ శివుడి దూత పాత్రలో నటించాడు. ఇప్పుడిదే వివాదానికి కారణమైంది. కొన్ని హిందూ సంఘాలు, సంస్థలు 'ఓ మై గాడ్‌ 2' సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. శివుడితో పాటు శివుని భక్తులను అవమానించేలా సినిమా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ హిందూ పరిషత్ సభ్యులు అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

Akshay Kumar: ఓ మై గాడ్‌ 2 సినిమాపై హిందూ సంఘాల ఆగ్రహం.. అక్షయ్‌ను చెంప దెబ్బకొడితే రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటన
Akshay Kumar
Follow us on

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్ కుమార్ నటించిన ‘ఓ మై గాడ్ 2’ శుక్రవారం (ఆగస్టు 11) గ్రాండ్‌గా రిలీజైంది. సినిమాకు సూపర్‌హిట్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. మొదటి రోజు రూ. 10 కోట్లు వచ్చినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా లైంగిక విద్య ప్రాధాన్యతను చర్చిస్తూ అమిత్‌ రాయ్‌ ఓ మై గాడ్‌ 2 సినిమాను తెరకెక్కించాడు. ఇందులో అక్షయ్ కుమార్ శివుడి దూత పాత్రలో నటించాడు. ఇప్పుడిదే వివాదానికి కారణమైంది. కొన్ని హిందూ సంఘాలు, సంస్థలు ‘ఓ మై గాడ్‌ 2’ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. శివుడితో పాటు శివుని భక్తులను అవమానించేలా సినిమా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ హిందూ పరిషత్ సభ్యులు అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

అలాగే సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆగ్రాకు చెందిన ఒక హిందూ సంస్థ అక్షయ్ కుమార్‌ను చెంప దెబ్బ కొట్టిన వారికి నగదు బహుమతిని కూడా అందజేస్తామని ప్రకటించింది. ఓ మై గాడ్‌ 2 సినిమా కథ విషయానికొస్తే.. మైనర్‌ పిల్లలకు లైంగిక విద్య ఆవశ్యకత గురించి వివరిస్తూ సందేశాత్మకంగా సినిమా సాగుతుంది.

ఈ సినిమాలో శివ భక్తుడిగా నటించిన పంకజ్‌ త్రిపాఠి తన కొడుకు కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. తన కొడుకు లైంగిక విద్యపై అవగాహన లేకపోవడం వల్లే ఒక పనికి పాల్పడ్డాడని గ్రహిస్తాడు. స్కూల్‌లో సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడంపై కోర్టులో కేసు వేస్తాడు. ఆ విధంగా కష్టాల్లో ఉన్న భక్తుడిని ఆదుకునేందుకు అక్షయ్ కుమార్ శివుని ఆజ్ఞపై శివదూతగా భూమికి వస్తాడు అక్షయ్‌ కుమార్.

విడుదలకు ముందే వివాదాలు..
ఓ మై గాడ్‌ 2 సినిమా విడుదలకు ముందే ఎన్నో వివాదాలు సృష్టించింది. CBFC సినిమాకు 16 కట్‌లను సూచించడమే కాకుండా A సర్టిఫికేట్‌ను జారీ చేసింది. అలాగే పద్దెనిమిదేళ్లలోపు పిల్లలను సినిమా చూడకుండా నిషేధించింది. ఇప్పుడు థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమాపై హిందూ అనుకూల సంస్థల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఓ మై గాడ్‌ 2 సినిమాలో యామీ గౌతమ్‌, పవన్‌ మల్హోత్ర, గోవింద నామ్‌దేవ్‌, బ్రిజేంద్ర కాలా తదితరులు కీలక పాత్రలో నటించారు. రుణా భాటియా, విపుల్‌, రాజేశ్‌ భల్‌, అశ్విన్‌ వాద్రా నిర్మాతలుగా వ్యవహరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.