Tollywood: ఈ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ మాజీ ప్రపంచ సుందరి.. యభై ఏళ్లైనా చెక్కు చెదరని అందం..

|

May 22, 2023 | 9:17 PM

పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆ అమ్మాయి మాజీ ప్రపంచ సుందరి. దాదాపు రెండు దశాబ్దాలు అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యాభై ఏళ్లకు దగ్గరకు వస్తోన్న చెక్కు చెదరని అందంతో సినీ ప్రియులను కట్టిపడేస్తుంది. గుర్తుపట్టరా ఆమె ఎవరో ?..

Tollywood: ఈ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ మాజీ ప్రపంచ సుందరి.. యభై ఏళ్లైనా చెక్కు చెదరని అందం..
Actress
Follow us on

సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ గురించి చెప్పక్కర్లేదు. కొద్ది రోజులుగా ఈ ట్రెండ్ తెగ హల్చల్ చేస్తుంది. సామాన్యులే కాకుండా.. సెలబ్రెటీలు సైతం తమ చిన్ననాటి ఫోటోస్, రేర్ పిక్స్ ఫాలోవర్లతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ హీరోయిన్ 29 ఏళ్లనాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆ అమ్మాయి మాజీ ప్రపంచ సుందరి. దాదాపు రెండు దశాబ్దాలు అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యాభై ఏళ్లకు దగ్గరకు వస్తోన్న చెక్కు చెదరని అందంతో సినీ ప్రియులను కట్టిపడేస్తుంది. గుర్తుపట్టరా ఆమె ఎవరో ?.. తనే మాజీ మిస్ వరల్డ్ సుష్మితా సేన్.

18 ఏళ్ల వయస్సులో మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది సుష్మితా సేన్. నాటి చారిత్రాత్మక విషయాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ నోట్ రాసి.. కొన్ని క్లాసిక్ ఫోటోస్ షేర్ చేసింది. “ఈ ఫోటో సరిగ్గా 29 సంవత్సరాల క్రితం నాటిది. . దీనిని ఎపిక్ మ్యాన్ ఫోటోగ్రాఫర్ ప్రబుద్ధ దాస్ గుప్తా ఫ్లాష్ చేసారు. అతడు నా 18 ఏళ్ల వయసును అందంగా బంధించాడు. అలాగే నేను చిత్రీకరించిన మొదటి మిస్ యూనివర్స్ నువ్వేనని అన్నాడు. భారతదేశపు మొట్ట మొదటి మిస్ యూనివర్స్ ఈ ఫోటోనే అని నేను గర్వంగా అన్నాను. నా మాతృభూమి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గెలవడం గొప్ప గౌరవం. ఇప్పటికీ ఈ గెలుపు గుర్తుకు వస్తే నాకు ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. 29 సంవత్సరాల తరువాత!!! చరిత్ర సాక్షిగా భారతదేశం మొట్టమొదటిసారిగా 21 మే 1994న మనీలా ఫిలిప్పీన్స్ లో (మహల్ కియా) మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నందున నేను ఈ రోజును చాలా గర్వంగా జరుపుకుంటాను.. గుర్తుంచుకుంటాను” అంటూ నోట్ రాశారు సుష్మితా.

ఇవి కూడా చదవండి

ప్రేమ- మంచితనంతో అత్యంత అందమైన సందేశాలు పంపిన మీ అందరికీ ధన్యవాదాలు.. ఇది ఎప్పటికీ ఆదరించండి. మీరంటే నాకు చాలా అభిమానం అని అన్నారు సుస్మిత. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు అభిమానులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.