Salman Khan: సల్మాన్ ఇంటి ముందు ఆగంతకుల హల్చల్.. బైక్ పై వచ్చి కాల్పులకు తెగబడ్డ దుండగులు..

|

Apr 14, 2024 | 8:48 AM

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కాల్పులు జరిపిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. సల్మాన్ ఇంటి దగ్గర్లోని సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు సల్మాన్ ఖాన్ ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటికే సల్మాన్ ఖాన్‌కు చాలాసార్లు హత్య బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జరగడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Salman Khan: సల్మాన్ ఇంటి ముందు ఆగంతకుల హల్చల్.. బైక్ పై వచ్చి కాల్పులకు తెగబడ్డ దుండగులు..
Salman Khan
Follow us on

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈరోజు ఉదయం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి ముంబై బాంద్రాలోని సల్మాన్ ఇంటి ముందు గాలిలో రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కాల్పులు జరిపిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. సల్మాన్ ఇంటి దగ్గర్లోని సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు సల్మాన్ ఖాన్ ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటికే సల్మాన్ ఖాన్‌కు చాలాసార్లు హత్య బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జరగడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నివేదికల ప్రకారం ఈరోజు ఉదయం సల్మాన్ ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు గాలిలో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్, ATS బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ నివాసం ముందు భారీగా పోలీసులు మోహరించారు. దుండగులు గాల్లోకి కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. గతేడాది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని చాలాసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యం అని అన్నాడు.

కెనడాలోని నటుడు-గాయకుడు గిప్పీ గ్రేవాల్ నివాసంపై కూడా అతను దాడి చేసాడు. సల్మాన్ ఖాన్‌తో అతనికి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా దాడి జరిగిందని అన్నారు. లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపు తర్వాత, ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ భద్రతను మరింత పెంచారు. 1998లో కృష్ణజింకలకు సల్మాన్ వెటాడినందుకే అతడిని చంపాలనుకున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ తెలిపాడు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సన్నిహితులకు బెదిరింపు లేఖలు పంపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.