Dilip Kumar: బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ (98) శ్వాస కోశ సమస్యల కారణంగా జూన్ 6న ముంబైలోని ఖార్ హిందూజా ఆసుపత్రిలో చేరారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఇండియా సినిమా స్థాయిని పెంచిన దిలీప్ కుమార్ .. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రతి నెల చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్తుంటారు. ఆదివారం శ్వాస కోశ సమస్యలు తీవ్రమవడంతో.. ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు ఆయన భార్య సైరాభాను సోషల్ మీడియా ద్వారా ఆయన ఆరోగ్యం గురించి స్పందించారు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ అనారోగ్యంతో ఆసుప్రతిలో చేరినప్పటినుంచి.. ఆయన మరణించారంటూ.. పలు వార్తలు సోషల్ మీడియాలో.. వాట్సాప్ లలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆయన భార్య సైరా భాను.. ఈ వార్తలపై దిలీప్ కుమార్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ” వాట్సాప్‌లలో వచ్చే ఫార్వర్డ్ మెసేజ్‌లను నమ్మకండి. సాబ్ ఆరోగ్యంగానే ఉన్నారు. మీ హృదయపూర్వక దువాస్, ప్రార్థనలకు ధన్యవాదాలు. తనను 2-3 రోజుల్లో ఇంటికి తీసుకెళ్లవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇన్ష్ అల్లాహ్ ” అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం దిలీప్ కుమార్ సీనియర్ డాక్టర్లు కార్డియాలజిస్ట్ నితిన్ గొఖలే, పుల్మనాలజిస్ట్ డాక్టర్ జలిల్ పార్‌కర్ పర్యవేక్షణలో ఉన్నారు. 1944లో ఆయన మొదటిసారిగా జ్వార్ భాతా సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆయన అసలు పేరు.. మహమ్మద్ యూసుఫ్ ఖాన్.భారత దేశం గర్వించదగ్గ నటుడు చివరగా హీరోగా కిలా సినిమాలో కనిపించారు. ఆ చిత్రం 1998లో విడుదలైంది. ఆ తరువాత సహాయ పాత్రలకు పరిమితమయ్యారు. గత ఏడాది కరోనా కారణంగా ఆయన సోదరలిద్దరిని కోల్పోయారు.
ట్వీట్..
Don’t believe in WhatsApp forwards.
Saab is stable.
Thank you for your heart-felt duas and prayers. As per doctors, he should be home in 2-3 days. Insh’Allah.— Dilip Kumar (@TheDilipKumar) June 6, 2021
Akhanda Movie: బాలయ్య సినిమా పై మరో బజ్.. ‘అఖండ’ రిలీజ్ అయ్యేది ఆరోజే..?