Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

|

Jan 21, 2024 | 8:00 PM

బాలీవుడ్‌కి అనేక హిట్ సినిమాలను అందించాడు సుశాంత్. సుశాంత్ చనిపోయిన తర్వాత కూడా అతన్ని ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. ఈరోజు సుశాంత్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో సుశాంత్ ఫోటోలు, అతని వీడియోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా అభిమానులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను గుర్తు చేసుకుంటున్నారు.

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?
Sushant Singh Rajput
Follow us on

అతి తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్న తెచ్చుకున్న హీరోల్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఒకరు . స్మాల్ స్క్రీన్ నుంచి కెరీర్ ప్రారంభించిన సుశాంత్ బాలీవుడ్ లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని ఈ లోకం, విడిచి వెళ్ళిపోయాడు. బాలీవుడ్‌కి అనేక హిట్ సినిమాలను అందించాడు సుశాంత్. సుశాంత్ చనిపోయిన తర్వాత కూడా అతన్ని ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. ఈరోజు సుశాంత్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో సుశాంత్ ఫోటోలు, అతని వీడియోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా అభిమానులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సుశాంత్  పేరు మారుమ్రోగుతోంది.

సుశాంత్ గురించిన కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.! సుశాంత్ తరచూ థియేటర్‌కి వెళ్లి అభిమానుల మధ్య కూర్చుని సినిమా చూసేవాడు. సినిమా ముగిసిన తర్వాత సుశాంత్ అభిమానుల ముందుకు వచ్చేవాడు. తన సొంత సినిమా అయినా సరే అభిమానుల మధ్య కూర్చొని సినిమా చూసేవాడు. సుశాంత్‌కు ఉన్న ఈ అలవాటు చాలా తక్కువ మంది అభిమానులకు మాత్రమే తెలుసు. అంతే కాదు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు, సుశాంత్ బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా పనిచేశాడు. సుశాంత్ కామన్ వెల్త్ గేమ్ ముగింపు వేడుకలో ఐశ్వర్యతో కలిసి బ్యాక్ డ్యాన్సర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ‘ధూమ్ 2’లో హృతిక్‌తో కలిసి బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కూడా పనిచేశాడు సుశాంత్.

సుశాంత్ నటనలోనే కాదు చదువులో కూడా నెంబర్ వన్. సుశాంత్ మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. సుశాంత్ ఇంజనీరింగ్ చదివింది మూడేళ్లు మాత్రమే. ఆ తర్వాత సుశాంత్ నటన వైపు మగ్గు చూపాడు. ఇది మాత్రమే కాదు, అతను ఫిజిక్స్ నేషనల్ ఒలింపియాడ్ విజేత కూడా.  సుశాంత్‌కి ఖగోళశాస్త్రంపై కూడా చాలా ఆసక్తి ఉండేది. అతనికి అనేక అధునాతన టెలిస్కోప్‌లు ఉన్నాయి. సుశాంత్ ఎప్పుడూ తన వద్ద ఉన్న బైనాక్యులర్స్ ద్వారా చంద్రుడిని అధ్యయనం చేసేవాడు. ఇది మాత్రమే కాదు, నటుడు చంద్రునిపై ల్యాండ్ కూడా కొనుగోలు చేశాడు. చంద్రుడిపై ల్యాండ్ కొనుగోలు చేసిన తొలి బాలీవుడ్ నటుడు సుశాంత్. సుశాంత్‌కి కొత్త విషయాలను అధ్యయనం చేయడం చాలా ఇష్టం. అంతేకాకుండా, అతని దగ్గర ఒక డైరీ ఉంది. సుశాంత్ తన కలలన్నీ డైరీలో రాసుకున్నాడు..కానీ సుశాంత్ కలలు చాలా వరకు నెరవేరలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి