బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ చేసిన బోల్డ్ ఫోటోషూట్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఓ మ్యాగజైన్ యాడ్ కోసం నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చి వార్తల్లో నిలిచాడు రణవీర్ (Ranveer Singh). దీంతో ఆయన చేసిన ఫోటోషూట్ పై విమర్షలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా రణవీర్ ఫోటోషూట్ పై చర్చ నడుస్తోంది. కొందరు ఆయనకు మద్దతు తెలుపుతుంటే.. మరి కొందరు మాత్రం రణవీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బోల్డ్ ఫోటోషూట్ చేసి మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ ముంబైలో రణవీర్ పై ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్‌కు కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్రిహోత్రి అండగా నిలిచారు. రణవీర్ పై ఎఫ్ఐఆర్ అనేది కేవలం తెలివితక్కువ ఎఫ్ఐఆర్ అన్నారు.
ఈ వివాదం వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ ” ఇది చాలా తెలివి తక్కువ ఎఫ్ఐఆర్. ఎటువంటి కారణం లేకుండానే కేవలం ప్రజలను ఆకర్షించడానికి వేసిన కేసు మాత్రమే. ఆ ఎఫ్ఐఆర్ లో మహిళల మనోభావాలను దెబ్బతీస్తున్నట్లు అని రాశారు. సరే ఇప్పుడు చెప్పండి. నేను స్త్రీల నగ్న ఫోటోలను చాలా చూశాను. మరీ ఆ చిత్రాల వల్ల పురుషుల మనోభావాలను దెబ్బతీనవా ?.. ఇది ముర్ఖపు వాదన. మన సంస్కృతిలో మానవ శరీరానికి గౌరవం ఉంది. మానవ శరీరం అనేది భగవంతుడి అత్యంత అందమైన సృష్టి. అ ఫోటోషూట్ లో తప్పేముంది? ఇది సంప్రదాయవాద ఆలోచనను చూపుతుంది. నేను దీనికి మద్దతు ఇవ్వను” అని అన్నారు. ప్రస్తుతం వివేక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.