Deepika Padukone – Raneer Singh: ప్రెగ్నెన్సీ అనౌన్స్ తర్వాత ఫస్ట్ టైమ్ భర్తతో దీపికా డాన్స్.. ప్రీవెడ్డింగ్‏లో అదరగొట్టిన దీపికా, రణవీర్..

ఐదేళ్ల తర్వాత వీరిద్దరు తమ మొదటిబిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దీపికా, రణవీర్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్లలో సందడి చేస్తున్నారు. మూడు రోజులుగా జరుగుతున్న ఈ వేడుకలలో బాలీవుడ్ నటీనటులు స్పెషల్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్, అమీర్ ఖాన్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, అనన్య పాండే, మనీష్ మల్హోత్రా వంటి స్టార్స్ స్టెప్పులేసి వావ్ అనిపించుకున్నారు. ఇక ఇదే వేడుకలలో మరింత స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు దీపికా రణవీర్.

Deepika Padukone - Raneer Singh: ప్రెగ్నెన్సీ అనౌన్స్ తర్వాత ఫస్ట్ టైమ్ భర్తతో దీపికా డాన్స్.. ప్రీవెడ్డింగ్‏లో అదరగొట్టిన దీపికా, రణవీర్..
Deepika, Ranveer

Updated on: Mar 03, 2024 | 1:22 PM

బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ దీపికా పదుకొణే, రణవీర్ సింగ్ తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్‏లో వీరిద్దరు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారు. ఈ విషయాన్ని గత రెండు రోజుల క్రితం దీపికా తన ఇన్ స్టా ద్వారా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. 2018లో ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఐదేళ్ల తర్వాత వీరిద్దరు తమ మొదటిబిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దీపికా, రణవీర్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్లలో సందడి చేస్తున్నారు. మూడు రోజులుగా జరుగుతున్న ఈ వేడుకలలో బాలీవుడ్ నటీనటులు స్పెషల్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్, అమీర్ ఖాన్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, అనన్య పాండే, మనీష్ మల్హోత్రా వంటి స్టార్స్ స్టెప్పులేసి వావ్ అనిపించుకున్నారు. ఇక ఇదే వేడుకలలో మరింత స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు దీపికా రణవీర్. ప్రెగ్నెన్సీ అనౌన్స్ తర్వాత మొదటి సారి తన భర్తతో కలిసి డాన్స్ చేసింది దీపికా.

దిల్ ధడక్నే దో సినిమాలోని “గల్లన్ గూడియాన్” పాటకు దీపికా రణవీర్ తమ అద్భుతమైన ప్రదర్శనతో అతిథులను ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ప్రెగ్నెంట్‏గా ఉన్న దీపికా నెమ్మదిగా ఎంతో జాగ్రత్తగా డాన్స్ చేసి అలరించింది. ప్రస్తుతం వీరిద్దరి డాన్స్ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇక అదే వేడుకలలో వీరిద్దరు కలిసి దాండియా ఆడారు. దీపికా ఎక్కడా తడబడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ డాన్స్ చేయడం చూసి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

గతేడాది పఠాన్, జవాన్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది దీపికా. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు చేశాయి. అలాగే ఇటీవలే ఫైటర్ సినిమాతో అలరించింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న కల్కి సినిమాలో నటిస్తుంది దీపికా.ఈ సినిమా మే 9న విడుదల కానున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.