Cruise Drugs Bust: బాలీవుడ్ కు సింహ స్వప్నం సమీర్ వాంఖేడే.. ఎవరు.. ఎంతమంది సెలబ్రిటీలతో టాక్స్ కట్టించారంటే..

NCB Officer Sameer Wankhede: నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో టాప్ క్లాస్ IRS ఆఫీసర్ సమీర్ వాంఖేడే. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో..

Cruise Drugs Bust: బాలీవుడ్ కు సింహ స్వప్నం సమీర్ వాంఖేడే.. ఎవరు.. ఎంతమంది సెలబ్రిటీలతో టాక్స్ కట్టించారంటే..
Sameer Wankhede

Edited By:

Updated on: Oct 05, 2021 | 7:17 PM

NCB Officer Sameer Wankhede: నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో టాప్ క్లాస్ IRS ఆఫీసర్ సమీర్ వాంఖేడే. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో సంబంధం ఉందని అనుమానించిన రియా చక్రవర్తి కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సమీర్ అవిశ్రాంతంగా ఒక్కో కేసుని చేదిస్తూ వస్తున్నారు. చాలా సార్లు డ్రగ్ పెడలర్స్ దాడి కూడా చేశారు. 2020 నవంబర్‌ 22న డ్రగ్స్‌ ముఠా సమీర్‌తోపాటు మరో ఐదుగురు ఎన్‌సీబీ అధికారులపై దాడి చేసింది. ఈ ఘటనలో సమీర్ గాయపడ్డారు. అయితే తాజాగా సమీర్‌ వాంఖెడే పర్యాటక నౌకలో డ్రగ్స్‌ పార్టీని భగ్నం చేసి, బడా బాబుల పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. సమీర్‌ వాంఖెడే గురించి వ్యక్తిగత వివరాలను ఇంటర్నెట్‌లో జనం ఆరా తీస్తున్నారు.

40 ఏళ్ల సమీర్‌ వాంఖెడే 2008 బాచ్ కి చెందిన IRS ఆఫీసర్, ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి పోలీసు ఆఫీసర్‌. సమీర్ వాంఖేడే కి బాలీవుడ్ తో కూడా సంబంధం ఉంది. పాపులర్ మరాఠీ నటి క్రాంతి రెడ్కర్ ని సమీర్ వాంఖేడే 2017 లో పెళ్లి చేసుకున్నారు. క్రాంతి రెడ్కర్ 2003 లో వచ్చిన హిందీ సినిమా గంగాజల్ లో క్రాంతి రెడ్కర్ నటించారు. ఇక IRS ఆఫీసర్ గా సమీర్ వాంఖేడే ముంబై ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ ఆఫీసర్ గా మొదటి పోస్టింగ్. 2004లో ఇండియన్‌ రెవెన్యూ సర్వీసు(ఐఆర్‌ఎస్‌)కు ఎంపికయ్యారు. ఇక గత రెండేళ్లలో సమీర్ వాంఖేడే అతని టీం కలిసి దాదాపుగా 17,000 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ని పట్టుకున్నారు. సమీర్ వాంఖేడే మొదట ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఏఐయూ) డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అదనపు ఎస్పీగా, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ)లో జాయింట్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు.

సమీర్ వాంఖేడే విధి నిర్వహణలో ఎలాంటి ప్రలోభాలకి లొంగరని.. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరు ఉంది. కస్టమ్స్ ఆఫీసర్ గా ఉన్న సమయంలో 2,000 మంది సెలబ్రిటీ ల మీద కేసులు బుక్ చేశారు. కస్టమ్స్ టాక్స్ చెల్లించాక మాత్రమే వాళ్ళు విదేశాలనుండి తెచ్చిన వస్తువులని రిలీజ్ చేశారు. వీరిలో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు కానీ ఎవరినీ వదలలేదు అందరి దగ్గర టాక్స్ కట్టించుకున్నారు. 2011 లో అప్పటి వరల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీ ముంబై ఎయిర్ పోర్ట్ కి రాగా దానిమీద గోల్డ్ కోటింగ్ ఉందని దానికి పన్ను చెల్లించాలని బయటికి పోకుండా ఆపేశారు సమీర్ వాంఖేడే. దీంతో చేసేది లేక టాక్స్ కట్టి ట్రోఫీ ని బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది.

2013 లో ముంబై ఎయిర్ పోర్ట్ నుండి బయటికి వెళ్లబోతున్న ప్రముఖ సింగర్ మికా సింగ్ దగ్గర విదేశీ కరెన్సీ ని పట్టుకొని జరిమానా విదించారు. ఇక DRI లో పనిచేస్తున్న సమయంలో అనురాగ్ కాశ్యప్, వివేక్ ఒబెరాయ్, రామ్ గోపాల్ వర్మ ఆస్తుల మీద దాడి చేసి కేసులు పెట్టారు. తాజాగా క్రూయిజర్ షిప్ మీద దాడి చేసి ఆర్యన్ ఖాన్ ని రెడ్ హాండెడ్ గా పట్టుకున్న టీం కి నేతృత్వం వహించింది కూడా సమీర్ వాంఖేడే నే ! సమీర్‌కు భయం అంటే ఏమిటో తెలియదని, క్రమశిక్షణ కలిగిన నిజాయతీపరుడైన అధికారి అని ఆయనతో కలిసి పనిచేసే తోటి ఆఫీసర్స్ ఉద్యోగులు చెబుతుంటారు.

Also Read: కీళ్లు, మోకాళ్ళు, వెన్నె నొప్పితో బాధపడుతున్నారా 15 రోజులు ఈ టీ తాగిచూడండి.. రిలీఫ్ పొందండి