కర్వా చౌత్…ఏటా దీపావళికి పది రోజులు ముందు వచ్చే ఈ పండగను ఉత్తరాది ప్రజలు ఎంతో వేడుకగా జరుపుకొంటారు. ఈ పండగను పురస్కరించుకుని మహిళలు తమ జీవిత భాగస్వామి క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఉపవాస దీక్షకు పూనుకుంటారు. అదేవిధంగా తమ భర్త ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని, కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక పెళ్లికాని అమ్మాయిలైతే తమకు మంచి భర్త రావాలని పూజలు చేస్తారు. అలా ఈ ఏడాది కూడా రెండు రోజుల(అక్టోబర్ 24, 25 తేదీలు) పాటు కర్వాచౌత్ వేడుకలు జరగనున్నాయి. ఉత్తరాది ప్రజలతో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ ఫెస్టివల్‌ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
నీ ప్రేమ వెలకట్టలేనిది..అయినా..
‘కర్వా చౌత్’ పండగను పురస్కరించుకుని ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద్ తన సతీమణి సునీతకు ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందించాడు. ‘నా ప్రాణ స్నేహితురాలు..నా జీవిత భాగస్వామి…నా ఇద్దరు అందమైన పిల్లలకు తల్లి.. నీపై నాకున్న ప్రేమ వెలకట్టలేనిది. అయినా కర్వాచౌత్‌ను పురస్కరించుకుని ఒక చిన్న బహుమతిని అందిస్తున్నాను’ అంటూ కారును గిఫ్ట్‌గా అందిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఆయనతో పాటు అమితాబ్ బచ్చన్, శిల్పాశెట్టి, యామీ గౌతమ్, వరుణ్ ధావన్, పంకజ్ త్రిపాఠి, మీరా కపూర్, కపిల్ శర్మ తదితరులు తమ సెలబ్రేషన్స్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మరి వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
Also Read: