తక్కువ వడ్డీకే భారీ రుణాలు ఇప్పిస్తానంటూ పలువురు ప్రముఖులను, బిజినెస్ మెన్లను మోసగించిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ అజయ్ యాదవ్ ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ ఢిల్లీకి చెందినప్పటికీ ముంబైలో మకాం పెట్టిన ఈయన..లవ్ ఫిర్ కభీ, ఓవర్ టైం, సస్పెన్స్ వంటి చిత్రాలు తీశాడని పోలీసులు చెప్పారు. అయితే వీటిలో నష్టాలు రావడంతో.. వాటిని భర్తీ చేసుకునేందుకు ఇలా పలువురిని మోసగించడం ప్రారంభించాడన్నారు. లోగడ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసినప్పటికీ బెయిలుపై విడుదలయ్యాడు. ఇటీవల రాహుల్ నాథ్ అనే బిజినెస్ మన్ ఇతని వలలో పడ్డాడు. ఇతనికి అతి తక్కువ వడ్డీకి రూ. 65 కోట్ల రుణం ఇప్పిస్తానని, అందుకు 32 లక్షలు చెల్లించాలని కోరడంతో నాథ్ అలాగే ఈ సొమ్ము చెల్లించాడు. కానీ ఎంత కాలానికీ తనకు ఆ రుణం లభించకపోవడంతో.. అజయ్ యాదవ్ ని ఈ విషయమై నిలదీయగా.. యేవో కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు. చివరకు రాహుల్ నాథ్ ఇతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అప్పటికే ముంబై నుంచి పరారయ్యాడు.
పోలీసులు ఇతనికోసం ముంబైతో బాటు ఢిల్లీ, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల్లో కూడా గాలించారు. ఎట్టకేలకు నిన్న మధురలో అరెస్టు చేశారు. తాను పెద్ద ఫైనాన్షియల్ కన్సల్టెంట్ నని, కోట్ల కొద్దీ రుణాలు ఇప్పిస్తానని, బాలీవుడ్ లో తనకు ఎంత్జో మంది ప్రముఖులు తెలుసునని అజయ్ యాదవ్ పేపర్లలో ప్రకటనలు ఇచ్చేవాడట. అలాంటి ఓ ప్రకటన చూసి రాహుల్ నాథ్ ఇతని బారిన పడి 32 లక్షలు నష్టపోయాడు.
మరిన్ని ఇక్కడ చూడండి : మాల్దీవుల మాదిరి ఇప్పుడు మన ఇండియాలో కూడా..ఎక్కడ..?ఎప్పుడు ..?అనుకుంటున్నారా..?(వీడియో)Maldives in India video.