
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి ఈరోజు గుండెపోటుతో మరణించారు.ఆమె తల్లి కిమ్ ఫెర్నాండెజ్ అనారోగ్య సమస్యలతో కొన్నిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఈరోజు మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఆమె మరణించినట్లు సమాచారం. ఈ విషాద వార్త జాక్వెలిన్, ఆమె కుటుంబాన్ని జీవితాంతం బాధలో ముంచెత్తింది. ఆమె అంత్యక్రియలు సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్‌గా జరుగుతాయని సమాచారం. మార్చి 24న, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కిమ్ గుండెపోటుతో లీలావతి ఆసుపత్రిలోని ఐసియులో చేరారు.
ఈ వార్త విన్న వెంటనే జాక్వెలిన్ అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూడటానికి తిరిగి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో ఆమె తన తల్లికి దగ్గరగా ఉంటూ తన తల్లికి సేవలు చేసింది. మార్చి 26న గౌహతిలో జరిగే ఐపీఎల్ వేడుకలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉండగా.. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న తల్లిని చూసేందుకు జాక్వెలిన్ ఐపీఎల్ ఆఫర్ వదులుకుంది.
గతంలో 2022లోనూ జాక్వెలిన్ తల్లి కిమ్ గుండెపోటుతో బహ్రెయిన్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కిమ్ ఫెర్నాండెజ్ బహ్రెయిన్‌లోని మనామాలో నివసిస్తున్నారు. ఆమెకు మలేషియా, కెనడియన్ వారసత్వం ఉంది. ఆమె తల్లి తరపు తాత కెనడాకు చెందినవారు. ఆమె ముత్తాతలు భారతదేశంలోని గోవాకు చెందినవారు.
Official Notice :
It is with deep sadness that we share the passing of Kim Fernandez , Jackie's beloved mother.
She has left us too soon, and our hearts go out to Jackie and her family during this incredibly difficult time.
May her soul rest in peace!#JacquelineFernandez— Team Jacqueline Fernandez (@TeamJaquelinee) April 6, 2025
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..