సెలబ్రెటీలు చేసే తప్పులను సోషల్ మీడియాలో ఏకి పారేస్తుటారు నెటిజన్స్. అందుకే సెలబ్రెటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ట్రోలింగ్ గురవుతూ లబోదిబోమంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కూడా ఇప్పుడు గోరంగా ట్రోల్స్ కు గురవుతుంది. ఈ అమ్మడి డ్రసింగ్ పై ఇప్పటికే ఓ రేంజ్ లో ట్రోల్స్ అవుతూ ఉంటాయి. ప్రవర్తన విషయంలో కూడా ఈ బ్యూటీ పై ట్రోల్స్ వస్తుంటాయి. తాజాగా నోరా ఫతేహి చేసిన పని ఇప్పుడు నెటిజన్స్ కు కోపం తెప్పించింది. కేవలం నెటిజన్స్ కు మాత్రమే కాదు భారతీయులందరికి కోపం తెప్పిస్తోంది. నోరా ఫతేహి, ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ స్టేజ్ మీద తన పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆమె చేసిన పనిమాత్రం అమ్మడి పై ఫైర్ అయ్యేలా చేస్తుంది.
ఆ స్టేజ్ పై మాట్లాడింది ఈ భామ. అదే సమయంలో ఇండియాకు చెందిన ఒక వ్యక్తి స్టేజ్ పైకి సడన్ గా వచ్చి మన జాతీయ జెండాను ప్రేక్షకులకు చూపించాడు.. దాంతో అక్కడే ఉన్న నోరా అతడి దగ్గర జండాను తీసుకొని ఆమె కూడా ప్రేక్షకులకు చూపించింది. మువ్వన్నెల జెండాను ఫిఫా స్టేజ్‌పై గర్వంగా ప్రదర్శించింది.
అయితే ఆమె చేసిన తప్పు ఏంటంటే..జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకుంది. కంగారులో పెట్టుకుందో ఏమో గాని జండాను తలక్రిందులు పట్టుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. . దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది..అది చూసిన నెటిజన్లు నోరాను ట్రోల్ చేస్తున్నారు. నోరా ఫతేహి తప్పకుండా క్షమాపణలుచెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ అమ్మడు దీని పై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Nora Fatehi Live Performance in Qatar. FIFA World Cup Qatar 2022. #FIFAWorldCup #FIFAWorldCupqatar2022 #FIFAFanFestival #NoraFatehi #livedance #liveperformance pic.twitter.com/kRP0gh6EnY
— Bipin Kumar Pal (@webbipinpal) November 29, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.