
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఈ మధ్య కాలంలో రణవీర్ సింగ్ సినిమాలు పెద్దగా సందడి చేయడం లేదు. ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం ఒకటి, రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రణ్‌వీర్ సింగ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడా అనే చర్చ బాలీవుడ్ లో జోరుగా సాగుతోంది. ఇది మాత్రమే కాదు, తాజాగా రణవీర్ సింగ్ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ముంబైలోని రెండు అపార్ట్‌మెంట్లను రణవీర్ సింగ్ అమ్మేశారని తెలుస్తోంది. దాంతో ఈ వార్తలకు బలం చేకూరింది.
రణవీర్ సింగ్ నటించిన ‘సర్కస్’ 2022లో విడుదలైంది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ‘సర్కస్’ దారుణంగా నిరాశపరచడంతో.. నిర్మాతలు నష్టపోయారు. దీంతో రణ్‌వీర్ సింగ్ కెరీర్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఈక్రమంలోనే రణ్‌వీర్‌కు ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రణవీర్ సింగ్ రెండు ఫ్లాట్లను అమ్మేశాడు. 2014లో రణ్‌వీర్ సింగ్ ఓ అపార్ట్‌మెంట్ కొన్నాడు. ఈ ఫ్లాట్‌ను రణవీర్ సింగ్ 15.25 కోట్ల రూపాయలకు అమ్మేశాడని తెలుస్తోంది. ఈ ఫ్లాట్ 1,324 చదరపు అడుగులు. ఈ అపార్ట్మెంట్లో మొత్తం ఆరు పార్కింగ్ స్థలాలు ఉన్నాయి.
రణ్‌వీర్ సింగ్ ఈ అపార్ట్‌మెంట్‌ను అమ్మేశాడని ఇప్పుడు చాలా చర్చలు జరుగుతున్నాయి. రణ్‌వీర్ సింగ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చాలా మంది చెప్తున్నారు. అయితే ఈ అపార్ట్‌మెంట్‌ను విక్రయించడానికి గల కారణాలను రణ్‌వీర్ సింగ్ ఇంకా బయటపెట్టలేదు. కొద్ది రోజుల క్రితం దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌లు షారుక్‌ఖాన్ ఇంటికి సమీపంలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. అందుకే పాత ఫ్లాట్‌ని అమ్మేశారని కూడా అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.