Raj kundra Sherlyn: నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ బాలీవుడ్ తార షెర్లిన్ చోప్రా గడిచిన ఏప్రిల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే షెర్లిన్ తమపై చేసిన ఆరోపణలు అవాస్తవమని కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకు మాత్రమే ఆమె ఇలా చేసిందని, షెర్లిన్ ఆరోపణలు నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటూ రాజ్‌కుంద్రా – శిల్పాశెట్టి దంపతుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపిన విషయం విధితమే. అంతటితో ఆగకుండా షెర్లిన్ చోప్రాపై ఏకంగా రూ. 50 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.
దీంతో ఈ విషయంపై తాజాగా నటి షెర్లిన్ చోప్రా ఎట్టకేలకు స్పందించారు. రాజ్‌కుంద్రా దంపతులు తనను గ్యాంగ్‌స్టర్‌లతో బెదిరింపులకు గురిచేశారని తెలిపిన షెర్లిన్.. ఇప్పుడు పరువునష్టం నోటీసులు కూడా ఇచ్చారని, కానీ ఇలాంటివాటికి భయపడేది లేదని తేల్చి చెప్పారు. తనను మానసికంగా వేధించినందుకు గాను రూ.75కోట్లు అడుగుతూ తానే తిరిగి వాళ్లకు నోటీసులు పంపానని చెప్పుకొచ్చారు.
గతంలో రాజ్‌కుంద్రాపై చేసిన ఫిర్యాదుపై విచారణకు తన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని పోలీసులను కోరుతున్నట్టు షెర్లిన్ తెలిపారు. మరి ఈ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
Also Read: Neem trees: అంతుచిక్కని కారణం.. నిట్టనిలువునా ఎండిపోతున్న వేపచెట్లు
Huzurabad By Election: మూగబోయిన మైకులు.. సైలెంటైన నేతలు.. ఇక మిగిలింది..