Priyanka Chopra : బాలీవుడ్ ను ఆదుకునేందుకు రంగంలోకి దిగనున్న గ్లోబల్ బ్యూటీ..

బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ టీగా ఎదిగిన ప్రియాంక ఆ తర్వాత కొన్ని హాలీవుడ్ సినిమాలు చేసిన గ్లోబల్ స్టార్ గా ఎదిగింది. ఆ తర్వాత నిక్ జోనస్ ను పెళ్ళాడి విదేశాలకు చెక్కేసింది.

Priyanka Chopra : బాలీవుడ్ ను ఆదుకునేందుకు రంగంలోకి దిగనున్న గ్లోబల్ బ్యూటీ..
Priyanka Chopra

Updated on: Nov 02, 2022 | 5:16 PM

ఇటీవల కాలంలో బాలీవుడ్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వరుస సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక మన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి అక్కడ కూడా భారీ వసూళ్ల ను సొంతం చేసుకుంటున్నాయి. దాంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు బాయ్ కాట్ బాలీవుడ్ అనే నినాదం ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ఏ సినిమా రిలీజ్ అయిన వెంటనే బాయ్ కాట్ అంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు కొందరు. ఇక రీసెంట్ డేస్ లో రిలీజ్ అయిన సినిమాల్లో బ్రహ్మాస్త ఒక్కటే కాస్త పర్లేదు అనిపించుకుంది.అయితే ఇప్పుడు బాలీవుడ్ ను ఆదుకోవడానికి గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా రంగంలోకి దిగితోందట.

బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ టీగా ఎదిగిన ప్రియాంక ఆ తర్వాత కొన్ని హాలీవుడ్ సినిమాలు చేసిన గ్లోబల్ స్టార్ గా ఎదిగింది. ఆ తర్వాత నిక్ జోనస్ ను పెళ్ళాడి విదేశాలకు చెక్కేసింది. ప్రియాంక ఇటీవల ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే.అయితే దాదాపు మూడేళ్ళుగా ఈ చిన్నది ఇండియాకు రాలేదు.ఇక ఇప్పుడు పీసీ ఇండియాలో అడుగు పెట్టింది. ప్రియాంక ఇండియాకు రావడానికి కారణం బాలీవుడ్ లో సినిమాలు చేయడానికే అంటున్నారు.

ప్రియాంక చోప్రా కమిట్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి.అలాగే కొత్త ప్రాజెక్ట్స్ కూడా చేయాలనీ చూస్తుందట ఇందుకోసమే ప్రియాంక ఇండియాకు వచ్చిందని అంటున్నారు. ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక.. ఇప్పుడు మరోసారి తన సత్త చాటడానికి సిద్ధం అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇక ప్రియనా కమిట్ అయిన సినిమాల్లో విశాల్‌ భరద్వాజ్‌, సంజయ్‌ లీలా భన్సాలీ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలకు  ప్రియాంక చోప్రా ఓకే చెప్పిందనే విషయం తెలిసిందే. మరి ప్రియాంక బాలీవుడ్ ను ఆదుకుంటుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి