బెల్లంకొండ ఫ్యామిలీనుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas.). అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా పరిచయమైన శ్రీనివాస్ మొదటి సినిమాతోనే నటనతో మంచి మార్కులు కోటేశారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించారు. ఇక రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు బెల్లంకొండ. ఇక చివరిగా అల్లుడు అదుర్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ బాట పట్టారు బెల్లంకొండ శ్రీనివాస్. తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన చిత్రయూనిట్.. శరవేగంగా ఆషూటింగ్ ను పూర్తి చేస్తుంది. అయితే ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించే హీరోయిన్ గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ముందుగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపించింది. ఆతర్వాత ఇద్దరు ముగ్గరు బడా హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నుష్రత్ భరుచ్చా నటిస్తుంది. నుష్రత్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది. నుష్రత్ హిందీలో ‘ప్యార్ కా పంచ్నామా’ ‘ప్యార్ కా పంచ్నామా 2’ ‘సోనూ కే టిటు కి స్వీటీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ నటించిన ‘రామ్ సేతు’ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది. బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న ఛత్రపతి రీమేక్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
Happiest Birthdayyy @Nushrratt ? wishing you all the happiness, love and success always! ? pic.twitter.com/WumKEh981s
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) May 17, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :