AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిన జాన్వీ కపూర్.. వైరల్ అవుతున్న ఫోటోస్..!

తన సినిమాల కంటే లవ్‌ ఎఫైర్స్‌ గాసిప్స్‌తో పాపులర్ అయిన జాన్వీ కపూర్.. ఇప్పుడు మరోసారి అదే విషయంలో టాప్‌ న్యూస్‌గా నిలిచింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ సిండే మనవడైన శిఖర్ పహరియాతో కలిసి వస్తూ కెమెరా కంటికి అడ్డంగా దొరికిపోయింది. ఓ ప్రైవేట్ పార్టీ నుంచి బయటికొస్తూ వీరిద్దరూ మీడియా కంట్లో పడ్డారు.

Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిన జాన్వీ కపూర్.. వైరల్ అవుతున్న ఫోటోస్..!
Janhvi And Shikhar Pahariya
Shiva Prajapati
|

Updated on: Apr 02, 2023 | 8:54 AM

Share

తన సినిమాల కంటే లవ్‌ ఎఫైర్స్‌ గాసిప్స్‌తో పాపులర్ అయిన జాన్వీ కపూర్.. ఇప్పుడు మరోసారి అదే విషయంలో టాప్‌ న్యూస్‌గా నిలిచింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ సిండే మనవడైన శిఖర్ పహరియాతో కలిసి వస్తూ కెమెరా కంటికి అడ్డంగా దొరికిపోయింది. ఓ ప్రైవేట్ పార్టీ నుంచి బయటికొస్తూ వీరిద్దరూ మీడియా కంట్లో పడ్డారు. ఇంకేముంది.. వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.

శ్రీదేవీ బోనీ కపూర్ డాటర్‌ గా చిన్నప్పటి నుంచే సెలబ్రిటీ ఇమేజ్‌ సొంతం చేసుకున్న జాన్వీ కపూర్.. తన అమ్మలాగే హీరయిన్ అయ్యారు. అనతికాలంలోనే బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అదే సమయంలో పార్టీల్లో.. ఫ్రెండ్స్‌ గ్యాదరింగ్స్‌లలో హైలెట్‌ అవుతూ, ఎఫైర్స్ విషయంలో నిత్యం వార్తల్లో హాట్‌ టాపిక్‌గా మారింది అమ్మడు.

ఇంతకు ముందు జాన్వీ.. తన చైల్డ్‌ హుడ్ ఫ్రెండ్ ఓర్హన్‌తో కాస్త క్లోజ్‌గా తిరిగి లవ్ బర్డ్స్‌ గా నామ్‌ కమాయించారు. ఆ తరువాత షాహిద్ బ్రదర్ ఇషాన్‌తో ఎక్కడ పడితే అక్కడ ఫ్లాష్‌ అయి.. ప్రేమలో పడ్డారనే న్యూస్ వైరల్ అయ్యేలా చేసుకుంది. ఇక ఇప్పుడు తన మాజీ పొలికల్ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న శిఖర్ పహరియాతో.. పార్టీస్, పబ్స్‌ అంటూ తిరుగుతోంది జాన్వీ. ఈ క్రమంలోనే మళ్లీ ప్రేమలో పడింది అనే టాక్‌ బీటౌన్‌లో బలంగా వినిపిస్తోంది. మొత్తంగా సినిమాలతో కంటే.. తన లవ్‌ స్టోరీ న్యూస్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఈ సుందరాంగి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..