Jacqueline Fernandez: మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు బెయిల్‌.. షరతులివే..

Jacqueline Fernandez: మనీలాండరింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు బెయిల్‌ మంజూరు చేసింది పాటియాలా కోర్టు. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్‌..

Jacqueline Fernandez: మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు బెయిల్‌.. షరతులివే..
Jacqueline Fernandez

Updated on: Sep 26, 2022 | 12:14 PM

Jacqueline Fernandez: మనీలాండరింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు బెయిల్‌ మంజూరు చేసింది పాటియాలా కోర్టు. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్‌ కేసులో పాటియాలా కోర్టులో హాజరైన జాక్వెలిన్‌.. బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్ట్‌.. ఆమె తరపు లాయర్‌ అభ్యర్థన మేరకు రూ. 50వేల పూచీకత్తుపై జాక్వెలిన్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

రూ. 200 కోట్ల రూపాయల స్కామ్‌ కేసులో న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరును ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఇప్పటికే పలుమార్లు విచారించిన ఈడీ.. ఆమెకు చెందిన రూ. 7 కోట్ల ఆస్తుల్ని అటాచ్‌ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ నుంచి జాక్వెలిన్ ఖ‌రీదైన వ‌స్తువుల్ని తీసుకున్నట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో ఈడీ చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్ట్‌..ఇవాళ కోర్టుకు హాజరుకావాలని జాక్వెలిన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు హాజరై.. బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..