Ankita Lokhande : ఆ సౌత్ నిర్మాత నన్ను రూమ్‌కి రమ్మన్నాడు.. సుశాంత్ మాజీ ప్రేయసి షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది ఈ అమ్మడు. అంకితా లోఖండే ఇటీవలే హిందీ బిగ్ బాస్ లో పాల్గొంది. అక్కడ ఈ అమ్మడు షాకింగ్ విషయాలు బయట పెట్టింది. తాజాగా సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన మీటూ అనుభవం గురించి మాట్లాడింది అంకితా లోఖండే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

Ankita Lokhande : ఆ సౌత్ నిర్మాత నన్ను రూమ్‌కి రమ్మన్నాడు.. సుశాంత్ మాజీ ప్రేయసి షాకింగ్ కామెంట్స్
Ankita Lokhande

Updated on: Mar 01, 2024 | 4:19 PM

ఇండస్ట్రీని వెంటాడుతున్న వాటిలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఒకటి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ గురించి మీడియా ముందు మాట్లాడారు. చాలా మంది షాకింగ్ కామెనీస్ చేశారు. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే  క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది ఈ అమ్మడు. అంకితా లోఖండే ఇటీవలే హిందీ బిగ్ బాస్ లో పాల్గొంది. అక్కడ ఈ అమ్మడు షాకింగ్ విషయాలు బయట పెట్టింది. తాజాగా సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన మీటూ అనుభవం గురించి మాట్లాడింది అంకితా లోఖండే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ సౌత్ దర్శకుడు తనను కాంప్రమైజ్ అవ్వమన్నాడని తెలిపింది.

అంకితా లోఖండే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో చేదు అనుభవం ఎదురైందట. అంకితా మాట్లాడుతూ.. ‘నా వయసు అప్పుడు 19 ఏళ్లు. సినిమా నటిని కావాలనుకున్నాను. ముంబైలో సౌత్ ఇండియన్ మూవీకి సంబంధించిన ఆడిషన్ జరిగింది. అందులో నేను పాల్గొన్నాను. కొన్ని రోజుల తర్వాత నాకు కాల్ వచ్చింది. నువ్వు ఎంపికైయ్యావు అని తెలిపారు. దాంతో నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నా అదృష్టం అంత బాలేదు.. అని అంకితా తెలిపింది.

‘ముంబైలోని జుహులో ఉన్న ఐషారామి హోటల్‌కు రావాలని నాకు చెప్పారు. అక్కడ అడ్వాన్స్ డబ్బులు ఇస్తానని చెప్పారు. నేను అక్కడికి వెళ్లినప్పుడు ఆడిషన్ చేసిన వ్యక్తి ఈ పాత్ర దక్కాలంటే కాంప్రమైజ్ అవ్వాల్సిందే అన్నారు. నాకు అర్ధం కాలేదు. అంటే మీ నిర్మాతతో కలిసి పార్టీకి వెళ్లాలా.? అని అడిగాను.. కాదు బెడ్ షేర్ చేసుకోవాలన్నారని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ‘నిర్మాతకి సహకరిస్తే తప్పకుండా ఈ సినిమాలో తీసుకుంటాం అన్నారు. నేను వెంటనే అక్కడి నుంచి లేచి ‘మీ నిర్మాతలకు టాలెంట్ అవసరం లేదు, వాళ్లతో పడుకునే యువతి కావాలి, కానీ నేను అలాంటి యువతిని కాదు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయానని తెలిపింది అంకిత లోఖండే.

అంకిత లోఖండే ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి