Shah Rukh Khan: మెట్ గాలాలో ఖరీదైన లగ్జరీ వాచ్‌తో షారుఖ్ ఖాన్.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ మొదటి సారి 'మెట్ గాలా' ఈవెంట్ కు హాజరయ్యాడు. ఎప్పటిలాగే తన స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఇదే ఇవెంట్ లో షారుఖ్ ఖాన్ చేతికి ఉన్న వాచ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Shah Rukh Khan: మెట్ గాలాలో ఖరీదైన లగ్జరీ వాచ్‌తో షారుఖ్ ఖాన్.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది
Shah Rukh Khan

Updated on: May 07, 2025 | 11:10 AM

ప్రపంచంలో అత్యంత ధనవంతులైన నటులలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా ఒకడు. అతని దగ్గర చాలా విలాసవంతమైన వస్తువులు ఉన్నాయి. అంతేగాక ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కోట్లాది ఆస్తులు ఉన్నాయి. సినిమాలు, ఐపీఎల్ తో బిజీగా ఉంటోన్న షారుఖ్ ఖాన్ తాజాగా
మెట్ గాలా ఈవెంట్ లో సందడి చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ లో కింగ్ ఖాన్ పాల్గొనడం ఇదే మొదటి సారి. కాగా అమెరికాలో సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ ఫ్యాషన్ ఫెస్టివల్‌లో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ గుర్తింపు పొందాడు. షారుఖ్ ఖాన్ మెట్ గాలాకు హాజరు కావడం ఇదే మొదటిసారి. కాబట్టి లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాడు. ఇందుకోసం అతను సబ్యసాచి డిజైన్ చేసిన కాస్ట్యూమ్ ధరించి మెట్ గాలాకు వచ్చాడు. డ్రస్ కలర్ కు మ్యాచింగ్ అయ్యేలా మెడలో ‘K’ అక్షరాన్ని హైలైట్ చేసే లాకెట్ ధరించాడు. దీంతో పాటు మెట్ గాలాలో షారుఖ్ ఖాన్ ధరించిన లగ్జరీ వాచ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. షారుఖ్ ఖాన్ ప్రతిష్టాత్మక ‘పటేక్ ఫిలిప్’ కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన చేతి గడియారాన్ని ధరించాడు. ‘పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్ 6300G’ అనే ఈ వాచ్ ధర సుమారు రూ. 21 కోట్లు!

 

ఇవి కూడా చదవండి

మెట్ గాలా వద్ద నీలిరంగు కార్పెట్ పై నడిచిన తర్వాత షారుఖ్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. అప్పుడు మీడియా ప్రతినిధులు “మీరు ఎవరు?” అని అడిగారు. దానికి షారుఖ్ కోపం తెచ్చుకోలేదు. “నేను షారుఖ్ ఖాన్ ని,” అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. అయితే దీనిపై షారఖ్ అభిమానులు మాత్రం మండిపడుతున్నారు.

మెట్ గాలాలో షారుఖ్ ఖాన్..

 

కాగా ‘మెట్ గాలా 2025’ ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్‌తో పాటు గాయకుడు దిల్జిత్ దోసాంజ్, నటి కియారా అద్వానీ, ఫ్యాషన్ డిజైనర్ సభ్యసాచి, ప్రియాంక చోప్రా, ఇషా అంబానీ తదితరులు పాల్గొంటున్నారు. దిల్జిత్ దోసంజ్ కాస్ట్యూమ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.