సినిమా ఇండస్ట్రీలో ఉండే ఎంతో మంది స్టార్ హీరోలకు స్మోకింగ్ అలవాటు ఉంది. అయితే ఆరోగ్యం లేదా తమ పిల్లల ప్రభావమో చాలామంది ఈ చెడ్డ అలవాటును మానేసుకున్నారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ చేరాడు. కింగ్ ఖాన్ షారుఖ్ కు కూడా మొన్నటివరకు ఈ చెడ్డ అలవాటు ఉండేది. ఒక్కోసారి అతను రోజుకు 100 సిగరెట్లుకు పైగా కాల్చేవాడు. ఈ అలవాటు కారణంగానే పబ్లిక్ ప్లేస్‌లో సిగరెట్ తాగి పలు సార్లు వివాదాల్లో ఇరుక్కున్నాడు. అయితే ఇప్పుడు షారుఖ్ పూర్తిగా మారిపోయాడు. పొగతాగడం మానేశాడు. రీసెంట్ గా తన బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని అందరికి చెప్పాడు. ‘నేను పొగతాగడం పూర్తిగా మానేశాను’ అని గర్వంగా చెప్పుకున్నాడు. అతనిలో వచ్చిన ఈ మార్పు పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ వయసు సుమారు 59 ఏళ్లు. సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడుకాబట్టి అతనికి ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే ట్టి స్మోకింగ్ కు దూరంగా ఉండాలని షారుఖ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. ధూమపానం మానేసానని, అందరూ ఈ చెడ్డ అలవాటును వదిలేయాలటూ షారుఖ్ ఖాన్ మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసి షారుఖ్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.
సిగరెట్ తాగడం పూర్తిగా మానేసినా షారుఖ్ ఖాన్ శ్వాస సమస్య పూర్తిగా నయం కాలేదు. ‘నేను ఎప్పుడూ శ్వాసకోశ సమస్యలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. కానీ ఇప్పటికీ అది సాధ్యం కాలేదు. త్వరలోనే అది సాధ్యమవుతుంది. నేను ధూమపానం మానేసినందుకు సంతోషంగా ఉంది’ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు షారుక్ ఖాన్.
షారుఖ్ ఖాన్ 2023లో ‘జవాన్’, ‘పఠాన్’ మరియు ‘డంకీ’ సినిమాలతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. కానీ 2024లో ఆయన సినిమాలేవీ విడుదల కాలేదు. స్క్రిప్ట్ సెలక్షన్‌లో చాలా ఓపికగా, శ్రద్ధగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు ఆయన పిల్లలు కూడా చిత్ర పరిశ్రమలో బిజీగా ఉన్నారు. కూతురు సుహానా ఖాన్ నటిగా చురుగ్గా వ్యవహరిస్తుండగా, కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంపై దృష్టి సారిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.