Bigg Boss : బిగ్ బాస్ హౌస్‌లో ప్రగ్నెన్సీ టెస్ట్.. రిజల్ట్ ఏమొచ్చిందంటే

హిందీలో బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సారి కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి భార్య భర్తలు అయిన అంకితా లోఖండే ,విక్కీ జైన్ పాల్గొన్నారు. హౌస్ లో ఈ ఇద్దరూ పోటాపోటీగా గేమ్ ఆడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే అంకిత తాను ప్రెగ్నెట్ అనే అనుమానం వ్యక్తం చేసింది. అంకిత ఇటీవల బిగ్ బాస్ లో తన భర్తతో మాట్లాడుతూ.. '

Bigg Boss : బిగ్ బాస్ హౌస్‌లో ప్రగ్నెన్సీ టెస్ట్.. రిజల్ట్ ఏమొచ్చిందంటే
Ankita Lokhande

Updated on: Nov 25, 2023 | 7:32 PM

అంకితా లోఖండే ,విక్కీ జైన్ బిగ్ బాస్ హిందీ హౌస్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. అంకితా లోఖండే ఇటీవల  తాను గర్భం  దాల్చానని అనుమానం వ్యక్తం చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించారు.. హిందీలో బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సారి కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి భార్య భర్తలు అయిన అంకితా లోఖండే ,విక్కీ జైన్ పాల్గొన్నారు. హౌస్ లో ఈ ఇద్దరూ పోటాపోటీగా గేమ్ ఆడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే అంకిత తాను ప్రెగ్నెట్ అనే అనుమానం వ్యక్తం చేసింది. అంకిత ఇటీవల బిగ్ బాస్ లో తన భర్తతో మాట్లాడుతూ.. ‘నాకు పీరియడ్స్‌ రాలేదు. నా బీపీలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నేను ప్రెగ్నెట్ అనే అనుమానం వస్తుంది అని తెలిపింది.  దాంతో బిగ్ బాస్ అంకితను ప్రెగ్నెన్సీ టెస్ట్ కు పంపించారు.

అంకిత ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ వచ్చిందని తెలుస్తోంది. తాజాగాప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ వచ్చింది.  ఆమె గర్భం దాల్చలేదని నిర్ధారణ అయ్యింది. త్వరలోనే బిగ్ బాస్ హౌస్‌లో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందా లేక ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారనేది ఆసక్తిగా మారింది.

అంకితా లోఖండే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. ఇద్దరూ ఆరేళ్ల పాటు డేటింగ్ చేశారు. సుశాంత్ సింగ్ సక్సెస్ తర్వాత అంకితకు దూరమయ్యాడని ఒక టాక్ కూడా ఉంది. అంకిత తర్వాత విక్కీని పెళ్లి చేసుకుంది. ఇద్దరి మధ్యా మనస్పర్థలు ఎక్కువ. బిగ్ బాస్ హౌస్‌లో ఇదే కనిపిస్తోంది.

అంకిత , విక్కీ బిగ్ బాస్ హౌస్ లోనూ చాలా గొడవ పడుతున్నారు. తాజాగా విక్కీని అంకిత షూతో కొట్టింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. విక్కీ తన భార్య షూ విరిసిన కూడా లైట్ తీసుకున్నాడు. త్వరలో వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.