Bigg Boss 15 OTT launch Highlights: బాలీవుడ్‌లో మొదలైన బిగ్ బాస్ సందడి.. తొలివారం నామినేషన్ ఎవరంటే?

|

Aug 08, 2021 | 11:50 PM

బాలీవుడ్ లో మొదలైన బిగ్ బాస్ సందడి. ఇప్పటికే 14 సీజన్స్ విజయవంతంగా నడిపిన బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 15 .  నేటినుంచి (ఆగస్టు 8 ) నుండి '

Bigg Boss 15 OTT launch Highlights:  బాలీవుడ్‌లో మొదలైన బిగ్ బాస్ సందడి.. తొలివారం నామినేషన్ ఎవరంటే?

బాలీవుడ్ లో మొదలైన బిగ్ బాస్ సందడి. ఇప్పటికే 14 సీజన్స్ విజయవంతంగా నడిపిన బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 15 .  నేటినుంచి (ఆగస్టు 8 ) నుండి ‘బిగ్ బాస్ OTT’ ప్రారంభంఅయ్యింది. బిగ్ బాస్ చరిత్రలో ఈ సీజన్  6 నెలల సాగనుంది.     ఆరు వారాల పాటు OTT లో బిగ్ బాస్ సందడి చేయనుంది. బిగ్ బాస్ 15  కేవలం Voot Select లో మాత్రమే చూసేఅవకాశం ఉంది. ఇంటి సభ్యుల మధ్య ఆటలు, పోటీలు, గొడవలు, ఏడుపులతో బిగ్ బాస్ హౌస్ సందడిగా మారనుంది.. మొదటి నుంచి బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఈ రీయాలిటీ షోకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సారి బిగ్ బాస్ హౌస్‌‌లోకి షమితా శెట్టి, రాకేశ్ బాపట్, ఉర్ఫీ జావేద్, ముస్కాన్ జాతత, కొరియోగ్రాఫర్ నిశాంత్ భట్ , దివ్య అగర్వాల్, రిద్ధిమా పండిట్, భోజ్‌పురి నటి అక్షర సింగ్, సింగర్ మిలింద్ గబా వంటి చాలా మంది ప్రముఖులు హౌస్‌‌లోకి వెళ్తున్నారు

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Aug 2021 11:47 PM (IST)

    తొలివారం ఎలిమినేషన్‌లో ఎవరంటే..

    కంటెస్టెంట్‌లతో జోడీగా ఎంపిక కానందున దివ్య అగర్వాల్ ఈ వారం బిగ్‌బాస్ ఎలిమినేషన్‌గా నామినేట్ అయింది. మొదటి నామినేటేడ్ కంటెస్టెంట్‌గా దివ్య అగర్వాల్ నిలిచారు. ప్రేక్షకులను ఆకట్టుకుని ఎలిమినేషన్‌ నుంచి బయటపడేందుకు ఒక వారం గడువును ఇచ్చారు.

  • 08 Aug 2021 11:44 PM (IST)

    కరణ్ నాథ్ జోడీగా ఎవరంటే..

    కరణ్ నాథ్.. దివ్య అగర్వాల్‌ను తిరస్కరిస్తూ.. రిద్దిమా పండిట్‌ను తన జోడీగా ఎంచుకున్నాడు.

  • 08 Aug 2021 11:43 PM (IST)

    ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు

    దివ్య, రిద్ధిమా జోడీ కోసం కరణ్ నాథ్ మాత్రమే మిగిలి ఉన్నాడు. దీంతో కరణ్‌ ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఎంచుకోవాలి. మిగతా వారు తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఉండనున్నారు.

  • 08 Aug 2021 11:39 PM (IST)

    కంటెస్టెంట్ నంబర్ 13: రిద్దిమా పండిట్ ఎంట్రీ..

    దివ్య అగర్వాల్ తరువాత రిద్దిమా పండిట్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

  • 08 Aug 2021 11:18 PM (IST)

    కంటెస్టెంట్ నంబర్ 12: దివ్య అగర్వాల్ ఎంట్రీ..

    స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ పాటతో దివ్య అగర్వాల్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

  • 08 Aug 2021 11:07 PM (IST)

    కంటెస్టెంట్ నంబర్ 11: అక్షర సింగ్ ఎంట్రీ..

    భోజ్‌పురి రాణి అక్షర సింగ్ 11వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సావాన్ మే లాగ్ గయి ఆగ్ అంటూ ఎంట్రీలో పాడిన పాటతో ఆకట్టుకుంది.

  • 08 Aug 2021 11:04 PM (IST)

    మూస్ జోడీగా ఎవరంటే..

    మూస్ జట్టానా తన జోడీగా నిశాంత్ భట్, ప్రతీక్ సహజ్‌పాల్‌ను ఎంచుకుని ఓ పోటీ నిర్వహించింది. ఇందులో కొరియోగ్రాఫర్ నిశాంత్ భట్‌ను మూస్ తన జోడీగా ఎంచుకుంది.

  • 08 Aug 2021 11:01 PM (IST)

    కంటెస్టెంట్ నంబర్ 10: మూస్ జట్టానా ఎంట్రీ..

    10వ కంటెస్టెంట్‌గా మూస్ జట్టానా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియా సంచలనంగా మారిన ఈ 20 ఏళ్ల భామ.. ఇప్పటి వరకు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో అతిపిన్న వయస్కురాలు.

  • 08 Aug 2021 10:58 PM (IST)

    అందరినీ ఆశ్చర్యపరిచిన నేహా జోడీ..

    నేహా జోడీగా రాకేష్, మిలింద్ గబాను ఎంచుకునే అవకాశం ఇచ్చాడు. అయితే అప్పటికే రాకేష్-షమితలు జోడీగా ఎంచుకోవడంతో మరొకరిని ఎంచుకొమ్మని కరణ్ జోహార్ కోరారు. దీంతో నేహా అందర్ని ఆశ్చర్యపరుస్తూ.. ప్రతీక్ సహజ్‌పాల్‌ను పోటీలోకి ఆహ్వానించింది. ఇద్దరి మధ్య పోటీ పెట్టగా.. నేహా మిలింద్ గబాను తన జోడీగా ఎంచుకుంది.

  • 08 Aug 2021 10:35 PM (IST)

    కంటెస్టెంట్ నంబర్ 9: సింగర్ నేహా భాసిన్ ఎంట్రీ

    తన వాయిస్‌తో అందర్ని పిచ్చెక్కించిన సింగర్ నేహా భాసిన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీలోనే కరణ్ జోహార్‌కే షాకిచ్చేలా మాట్లాడింది. బిగ్‌హౌస్‌లోని పోటీదారులలో ఎవరితోనైనా బెడ్ షేర్ చేసుకుంటానంటూ చెప్పుకొచ్చింది.

  • 08 Aug 2021 10:28 PM (IST)

    మరో జోడీ కుదిరింది..

    ఉర్ఫీ జోడీగా కరణ్ నాథ్‌, జీషన్‌లను ఎంచుకునే ఆప్షన్ ఇచ్చాడు. ఈ ఇద్దరికి పెట్టిన పోటీలో… జీషన్‌ను జోడీగా ఎంచుకుంది.

  • 08 Aug 2021 10:07 PM (IST)

    ఉర్ఫీ జావేద్ ఎంట్రీ..

    షమిత తరువాత ఉర్ఫీ జావేద్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరైంది. సోషల్ మీడియాలో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. వేదికపైకి వచ్చిన ఉర్ఫీ… కరణ్ జోహార్‌తో ప్రేమలో పడ్డానంటూ బాంబ్ పేల్చింది.

  • 08 Aug 2021 09:56 PM (IST)

    షమితాకు సాయం చేసిన మలైకా..

    కరణ్ అబ్బాయిలకు షమితను పరిచయం చేశాడు. షమిత తన కనెక్షన్ కోసం రాకేష్ – కరణ్ నాథ్‌లో ఒకరిని ఎంచుకోవాలని చెప్పారు. దాంతో మలైకా సహాయంతో రాకేష్ ను ఎంచుకుంది షమిత.

  • 08 Aug 2021 09:52 PM (IST)

    బిగ్ బాస్ యొక్క మొదటి కనెక్షన్ ఏర్పడింది..

    షమితా రాకేష్‌‌‌‌తో కనెక్షన్ ఏర్పరుచుకుంది. దానితో బిగ్ బాస్ హౌస్‌‌‌లో మొదటి కనెక్షన్  ఏర్పడింది.

  • 08 Aug 2021 09:42 PM (IST)

    బిగ్ బాస్ 15 మొదటి మహిళా కంటెస్టెంట్‌‌‌‌గా షమితా శెట్టి

    శిల్పా శెట్టి  చెల్లెలు షమితా శెట్టి బిగ్ బాస్‌‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయిలలో మొదటి కంటెస్టెంట్‌‌‌‌గా షమితాశెట్టి ప్రవేశించింది.

  • 08 Aug 2021 09:30 PM (IST)

    బిగ్ బాస్ వేదికపై యోగ పాటలు నేర్పిన మలైకా..

    బిగ్ బాస్ వేదికపై అమ్మాయిలను పరిచయం చేయడానికి ముందు.. మలైకా మేల్ కంటెస్టెంట్స్‌‌‌కు వేదికపై యోగా ఆసనాలు వేయాలని చెప్పింది. దాంతో వారు ఆసనాలు వేశారు.

  • 08 Aug 2021 09:21 PM (IST)

    బిగ్ బాస్‌‌‌‌ వేదిక పై స్పైసీ పర్ఫామెన్స్‌‌తో అదరగొట్టిన మలైకా..

    బిగ్ బాస్‌‌‌‌ వేదిక పై సందడి చేసింది మలైకా  అరోరా.. అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్‌‌తో ఆకట్టుకుంది ఈ అందాల భామ. కరణ్ జోహార్ స్నేహితురాలైన మలైకా అరోరా బిగ్ బాస్ వేదికపై చాలా హాట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది.

  • 08 Aug 2021 09:18 PM (IST)

    బిగ్ బాస్‌‌‌‌లో ఎంట్రీ ఇచ్చాడు ప్రతీక్ సహజ్‌పాల్..

    బిగ్ బాస్‌‌‌లోకి ప్రతీక్ సహజ్‌పాల్. ప్రతీక్ పవిత్ర పునియా మాజీ ప్రియుడు. ప్రతీక్‌‌‌తో కరణ్ జోహార్ వేదిక సందడి చేశారు.

  • 08 Aug 2021 09:05 PM (IST)

     బిగ్ బాస్ షోలోకి కరణ్ నాథ్ ఎంట్రీ…

    బిగ్ బాస్ షోలో కరణ్ నాథ్ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 9 సంవత్సరాల పాటు సినిమాల నుండి విరామం తీసుకున్న కరణ్ నాథ్ ఇప్పుడు ఇలా బిగ్ బాస్‌‌‌‌లో ప్రత్యక్షం అయ్యారు.

  • 08 Aug 2021 08:57 PM (IST)

    డాన్సర్ నిశాంత్ భట్ బిగ్ బాస్ హౌస్‌‌‌లోకి అడుగు పెట్టారు..

    బిగ్ బాస్‌‌‌లో నాలుగో కంటెస్టెంట్ గా నిశాంత్ భట్ ప్రవేశించారు. నిషాంత్ ప్రస్తుతం కలర్స్ టీవీ డాన్స్ దీవానేలో పాటిస్పెట్ చేస్తున్నారు.

  • 08 Aug 2021 08:40 PM (IST)

    బిగ్ బాస్ 15 లో పంజాబీ సింగర్ మిలింద్ గబా ఎంట్రీ

    ఇద్దరు ఇంటిసభ్యుల తర్వాత బిగ్ బాస్ హౌస్‌‌లో పంజాబీ గాయకుడు మిలింద్ గబా ఎంటర్ అయ్యారు.

  • 08 Aug 2021 08:31 PM (IST)

    రెండో కంటెస్టెంట్‌‌‌గా ఎంట్రీ ఇచ్చారు జీషన్ ఖాన్

    బిగ్ బాస్ హౌస్‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన జీషన్ ఖాన్. రాకేష్ తర్వాత జీషన్ ఖాన్ షోలోకి ప్రవేశించారు..

  • 08 Aug 2021 08:28 PM (IST)

    బిగ్ బాస్‌లో కొత్త ట్విస్ట్… ప్రతి ఇంటిసభ్యునికి ఒక కనెక్షన్

    బిగ్ బాస్‌లో కొత్త ట్విస్ట్ వచ్చింది. ప్రతి ఇంటిసభ్యునికి ఒక కనెక్షన్ చేయబడుతుంది. ఆ కనెక్షన్‌తో ఒకొక్కరు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశిస్తారు. ప్రతి మేల్ కంటెస్టెంట్‌‌‌‌కు ఓ ఫీమేల్ కంటెస్టెంట్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. 

  • 08 Aug 2021 08:18 PM (IST)

    మొదటి కంటెస్టెంట్‌‌‌‌గా రాకేశ్ బాపట్‌ ఎంట్రీ..

    మొదటి కంటెస్టెంట్‌‌‌‌గా రాకేశ్ బాపట్‌ ఎంటర్ అయ్యాడు. కరణ్ జోహార్ వేదికపైకి అతడిని స్వాగతించారు

  • 08 Aug 2021 08:15 PM (IST)

    ఇంటిసభ్యులకు స్వాగతం పలికిన కరణ్ జోహార్

    బిగ్ బాస్ 15 ప్రారంభమైంది, కరణ్ జోహార్ ఇంటిసభ్యులకు కభీ ఖుషి కభీ ఘమ్ శైలిలో స్వాగతం పలికారు.

  • 08 Aug 2021 08:04 PM (IST)

    మళ్లీ మొదలు కానున్న ఆటలు, పాటలు, పోటీలు, గొడవలు..

    ఇంటి సభ్యుల మధ్య ఆటలు, పోటీలు, గొడవలు, ఏడుపులతో బిగ్ బాస్ హౌస్ సందడిగా మారనుంది.. మొదటి నుంచి బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఈ రీయాలిటీ షోకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.

  • 08 Aug 2021 08:00 PM (IST)

    ఈ సారి బిగ్ బాస్ హౌస్‌‌లోకి  వెళ్ళేది వీరే…

    ఈ సారి బిగ్ బాస్ హౌస్‌‌లోకి  షమితా శెట్టి, రాకేశ్ బాపట్, ఉర్ఫీ జావేద్, ముస్కాన్ జాతత, కొరియోగ్రాఫర్ నిశాంత్ భట్  , దివ్య అగర్వాల్, రిద్ధిమా పండిట్, భోజ్‌పురి నటి అక్షర సింగ్, సింగర్ మిలింద్ గబా వంటి చాలా మంది ప్రముఖులు హౌస్‌‌లోకి వెళ్తున్నారు

Follow us on