350 కోట్లతో సినిమా తీస్తే ఊహించని డిజాస్టర్.. డైరెక్టర్‌కు రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు.. ఏ మూవీనో తెలుసా?

|

Sep 22, 2024 | 10:18 PM

ఒక సినిమా విజయం సాధిస్తే చాలా మంది జీవితాలు మారిపోతాయి. అదే సినిమా పరాజయం పాలైతే చాలా మంది జీవితాలు దెబ్బతింటాయి. ఇటీవలే రూ. 350 కోట్లు ఖర్చు పెట్టి స్టార్ హీరోలతో భారీ యాక్షన్ మూవీని తెరకెక్కించారు. తీరా చూస్తే ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఫలితంగా..

350 కోట్లతో సినిమా తీస్తే ఊహించని డిజాస్టర్.. డైరెక్టర్‌కు రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు.. ఏ మూవీనో తెలుసా?
Movie Shooting
Follow us on

ఒక సినిమా విజయం సాధిస్తే చాలా మంది జీవితాలు మారిపోతాయి. అదే సినిమా పరాజయం పాలైతే చాలా మంది జీవితాలు దెబ్బతింటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ మూవీ ‘బడే మియా చోటే మియా’. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లింది. ఈకారణంగానే దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ కు రెమ్యునరేషన్ అందలేట. దీంతో ఇప్పుడు తనకు న్యాయం జరగాలని పట్టుబడుతున్నాడట ఈ బాలీవుడ్ డైరెక్టర్. నివేదికల ప్రకారం, బడే మియా చోటే మియా దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తన బాధను వ్యక్తం చేస్తూ డైరెక్టర్ల యూనియన్‌కు లేఖ రాశారు. ఒప్పందం ప్రకారం ఈ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు అలీ అబ్బాస్ జాఫర్‌కు రూ.7.3 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ నిర్మాతలు తనకు ఆ డబ్బు ఇవ్వలేదని అలీ అబ్బాస్ జాఫర్ ఆరోపించారు. బడే మియా చోటే మియా చిత్రంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లార్, సోనాక్షి సిన్హా నటించారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు దాదాపు 350 కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కేవలం 102 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది.

‘పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌’ పతాకంపై జాకీ భగ్నానీ, వాషు భగ్నానీ నిర్మించిన చిత్రం ‘బడే మియా చోటే మియా’. ఈ సినిమాతో నిర్మాతలకు భారీ నష్టమే వాటిల్లిందని సమాచారం. ఈ కారణంగానే తమ సంస్థలో పనిచేసిన చాలా మందికి జీతాలు కూడా చెల్లించలేకపోతున్నారని సమాచారం. అంతే కాకుండా ముంబైలోని తమ ఆస్తులను కూడా అమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌కి పారితోషికం ఇవ్వ లేదని తేలింది.

ఇవి కూడా చదవండి

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.