Amitabh Bachchan: మళ్లీ కరోనా బారిన పడిన బిగ్‌బీ.. వారందరూ టెస్ట్‌లు చేయించుకోవాలంటూ వినతి

|

Aug 24, 2022 | 6:02 AM

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan) కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ' కరోనా నిర్ధారణ పరీక్షల్లో నాకు పాజిటివ్‌గా తేలింది...

Amitabh Bachchan: మళ్లీ కరోనా బారిన పడిన బిగ్‌బీ.. వారందరూ టెస్ట్‌లు చేయించుకోవాలంటూ వినతి
Amitabh Bachchan
Follow us on

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan) కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘ కరోనా నిర్ధారణ పరీక్షల్లో నాకు పాజిటివ్‌గా తేలింది. నా చుట్టూ ఉన్న వారు అలాగే పరిచయం ఉన్న ఎవరైనా, దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు అమితాబ్‌. కాగా బిగ్‌బీ ప్రస్తుతం బుల్లితెర క్విజ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 14వ సీజన్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ సందర్భంగా ఆయన పలువురిని కలుస్తున్నారు. కాగా కరోనా ఆంక్షలు, నిబంధనల నేపథ్యంలో గత రెండేళ్లుగా కేబీసీ షూటింగ్ ప్రేక్షకులు లేకుండానే జరిగింది. అయితే ఈ ఏడాది మాత్రం మళ్లీ పాత పద్ధతిలోనే షోను నిర్వహిస్తున్నారు. అయితే బచ్చన్‌కు కరోనా ఎలా వచ్చిందనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

కాగా గత ఏడాది 2021లో జూలై 11న కరోనా కారణంగా అమితాబ్ బచ్చన్ ముంబైలోని విలే పార్లేలోని నానావతి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అమితాబ్‌తో పాటు, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఆరాధ్య కూడా కరోనా కోరలకు చిక్కారు. అమితాబ్ బచ్చన్‌తో పాటు అభిషేక్ కూడా కొద్దిరోజులు నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయి. అక్కడ గత 24 గంటల్లో 25% కరోనా కేసులు పెరిగాయి. ప్రస్తుతం నగరంలో 12 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..